Axis Bank MCLR Loans: యాక్సిస్‌ బ్యాంకు కీలక నిర్ణయం.. ఆ వడ్డీ రేట్ల పెంపు..!

|

Apr 19, 2022 | 9:29 PM

Axis Bank MCLR Loans: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవల తన ద్రవ్య పాలసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వివిధ బ్యాంకులు..

Axis Bank MCLR Loans: యాక్సిస్‌ బ్యాంకు కీలక నిర్ణయం.. ఆ వడ్డీ రేట్ల పెంపు..!
Follow us on

Axis Bank MCLR Loans: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవల తన ద్రవ్య పాలసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వివిధ బ్యాంకులు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), కొటాక్‌ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)ఎస్బీఐ దారిలోనే యాక్సిస్‌ బ్యాంకు కూడా పయనిస్తోంది. మార్జినల్‌ కాఫ్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్ట్‌ లెండింగ్‌ రేటు (MCLR) పెంచుతున్నట్లు బ్యాంకు వెల్లడించింది. అన్ని రకాల రుణాల ఆధారంగా ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఐదు బేసిక్‌ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది.

ఈ సంవత్సరం గడువు గల రుణాల ఎంసీఎల్‌ఆర్‌ 7.40 శాతం, రెండేళ్లు గడువు రుణాలపై 7.50, మూడేళ్ల గ‌డువు గ‌ల రుణాల‌పై ఎంసీఎల్ఆర్ 7.55 శాతానికి పెరుగుతుంది. ఇక ఓవ‌ర్ నైట్, నెల రోజుల గ‌డువు గ‌ల రుణాల ఎంసీఎల్ఆర్ 7.20 శాతం, మూడు నెల‌ల గ‌డువు గ‌ల రుణాల‌పై 7.30, ఆరు నెల‌ల గ‌డువు ఉన్న రుణాల‌పై 7.35 శాతం ఎంసీఎల్ఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రుణం గడువు-ఎంసీఎల్‌ఆర్‌ శాతం:

☛ ఓవ‌ర్‌నైట్ – 7.20 శాతం

☛ ఒక నెల -7.20 శాతం

☛ 3 నెల‌లు -7.30 శాతం

☛ 6 నెల‌లు -7.35 శాతం

☛ ఏడాది – 7.40 శాతం

☛ రెండేళ్లు – 7.50 శాతం

☛ మూడేళ్లు -7.55 శాతం

ఎంసీఎల్‌ఆర్‌తో రుణ గ్రహితలపై పెరుగుదలకు అనుగుణంగా రుణ గ్రహితలు తీసుకున్న రుణాపలై వడ్డీ పెరుగుతుంది.

 

ఇవి కూడా చదవండి

Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!

EPFO: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్‌..? వేతన పరిమితి రూ.21వేలకు పెంపు..!

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు