AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: మీ క్రెడిట్‌ స్కోర్‌ త్వరగా తగ్గుతుందా?.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో చెక్‌ పెట్టండి!

ప్రతి ఒక్కరికి క్రెడిట్‌ స్కోర్ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్ సరిగ్గా లేకపోతే.. మీకు బ్యాంకులు లోన్స్‌ ఇవ్వవు.. దీని కారణంగా డబ్బు అత్యవసరమైన సమయంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంత మంది తీసుకున్న లోన్స్‌ కరెక్ట్‌గా చెల్లించని కారణంగా, క్రెడిట్‌ కార్డు పేమెంట్స్ సరైన టైంలో చెల్లించని కారణంగా మీ క్రెడిట్‌ స్కోర్ తగ్గుతుంది. అయితే మీ క్రెడిట్‌ స్కోర్ వెగంగా పడిపోకుండా ఉండాంటే ఈ కొన్ని తప్పలు చేయకుండా ఉంటే చాలు. అవెంటో తెలుసుకుందాం పదండి.

Credit Score: మీ క్రెడిట్‌ స్కోర్‌ త్వరగా తగ్గుతుందా?.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో చెక్‌ పెట్టండి!
Low Credit Score
Anand T
|

Updated on: Oct 31, 2025 | 8:38 PM

Share

ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్లు అనేది అతని ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిబింబం వంటిది. ఒక వ్యక్తి తక్కువ వడ్డీ రేట్లు పొందాలన్నా, త్వరగా రుణాలు పొందాలన్న మంచి క్రెడిట్ స్కోరు చాలా అవసరం. అయితే ఆర్థిక సమస్యల కారణంగా కొందరు తీసుకున్న లోన్స్‌ సమాయానికి చెల్లించక పోవడం, క్రెడిట్‌ కార్డు బిల్స్‌ సకాలంలో కట్టకపోవడం కారణంగా తమ క్రెడిట్‌ స్కోర్‌ను కోల్పోతూ ఉంటారు. ఇలా మీ క్రెడిట్ స్కోర్లు త్వరగా పడిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని తప్పులు చేయడం మానేయాలి. ఈ కారణాలపై మనం శ్రద్ధ వహిస్తే, క్రెడిట్ స్కోర్‌లలో వేగంగా తగ్గుదలని నివారించవచ్చు.

మీ క్రెడిట్ స్కోరు త్వరగా తగ్గకుండా ఉండటానికి వీటిపై శ్రద్ధ వహించండి

  • మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణ చెల్లింపులను సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గుతుంది. దీనిని నివారించడానికి ఆటో చెల్లింపులు మంచి మార్గం.
  • ఒక నిర్దిష్ట క్రెడిట్ పరిమితికి మించి క్రెడిట్ కార్డులను ఉపయోగించవద్దు. మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే తక్కువ వాడటం మానేయండి.
  • మీరు ఎక్కువగా లోన్స్‌ కోసం దరఖాస్తు చేస్తూ ఉంటే.. దాన్ని వెంటనే ఆపేయండి. ఇది ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.
  • మీ దగ్గర ఉన్న పాత క్రెడిట్ ఖాతాలను బ్లాక్ చేసి కొత్తవి తీసుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి పాత కార్డులను బ్లాక్ చేయకండి.
  • ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ క్రెడిట్ నివేదికను చెక్ చేసుకోండి. ఏదైనా తప్పు సమాచారం ఉందో లేదో తనిఖీ చేసి సరిచేయండి. మీ క్రెడిట్ నివేదికను ఎప్పకప్పుడూ తాజాగా ఉంచుకోండి.
  • సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల బ్యాలెన్స్‌ను ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించడానికి ప్రధాన కారణం
  • పైన పేర్కొన్న ఈ జాగ్రత్తలు, అలవాట్లను పాటించడం ద్వారా మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవచ్చు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.