CIBIL Score: తరచూ సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారా? అయితే ఇబ్బందులు తప్పవు! మరోసారి చెక్ చేసే ముందు ఇది చదవండి..
సిబిల్ స్కోర్ అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు, పాత లోన్ల చెల్లింపులు, ఈఎంఐ లావాదేవీల ఆధారంగా క్రోడీకరించే డేటా. దీనినే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అని కూడా పిలుస్తారు. అధిక సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు మిమ్మల్ని తక్కువ రిస్క్ ఉన్న రుణ గ్రహీతగా గుర్తిస్తాయి. తక్కువ సిబిల్ ఉంటే అధిక రిస్క్ ఉన్న రుణ గ్రహీతగా నిర్ధారిస్తాయి. ఇలాంటి సందర్బాల్లో సులభంగా లోన్లు రావు. ఒక వేళ వచ్చిన అధిక వడ్డీ రేటు విధిస్తారు.

మీకు పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్ ఇలా ఏది కావాలన్నా మొదటి బ్యాంకర్లు చూసేది సిబిల్ స్కోర్. మీరు క్రెడిట్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా బ్యాంకర్లు తనిఖీ చేసేది ఇదే. ఈ సిబిల్ స్కోర్ మీ ఆర్థిక స్థితిక ఒక సింబల్ లా కనిపిస్తుంది. మీరు లోన్లను క్రమంగా చెల్లించగలరా లేదా మీకు ఎంత మొత్తం లోన్ ఇవ్వొచ్చు? వడ్డీ ఎంత ఉండాలి అనేది మీ సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకర్లు నిర్ణయిస్తారు. అందుకే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే లోన్లు సులభంగా తక్కువ వడ్డీకి వచ్చే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్లు మంజూరు చేయడానికి ఆలోచిస్తాయి. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? బ్యాంకులు దీనిని ఎందుకు అంతా ప్రాధాన్యం ఇస్తాయి? తరచూ ఈ సిబిల్ స్కోర్ తనిఖీ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? తెలుసుకుందాం రండి..
సిబిల్ స్కోర్ అంటే..
సిబిల్ స్కోర్ అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు, పాత లోన్ల చెల్లింపులు, ఈఎంఐ లావాదేవీల ఆధారంగా క్రోడీకరించే డేటా. దీనినే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అని కూడా పిలుస్తారు. అధిక సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు మిమ్మల్ని తక్కువ రిస్క్ ఉన్న రుణ గ్రహీతగా గుర్తిస్తాయి. ఎందుకంటే మీ పాత రుణాలు సక్రమంగా చెల్లిస్తేనే సిబిల్ పెరుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఇచ్చే లోన్లు కూడా తిరిగి చెల్లిస్తారన్న నమ్మకం బ్యాంకర్లకు కలుగుతుంది. తక్కువ సిబిల్ ఉంటే అధిక రిస్క్ ఉన్న రుణ గ్రహీతగా నిర్ధారిస్తాయి. ఇలాంటి సందర్బాల్లో సులభంగా లోన్లు రావు. ఒక వేళ వచ్చిన అధిక వడ్డీ రేటు విధిస్తారు.
సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి..
700 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకర్లు మంచి కస్టమర్ గా భావిస్తాయి. అయితే 700 కంటే తక్కువ అంటే సబ్‌ప్రైమ్, రుణగ్రహీత రుణంపై డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని బ్యాంకర్లు నిర్ధారిస్తారు. చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగం, గతంలో తీసుకున్న క్రెడిట్‌ల సంఖ్యతో సహా అనేక అంశాలు స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి. వీటిలో, చెల్లింపు చరిత్ర అత్యంత కీలకమైన అంశం, ఎందుకంటే ఒక్క ఆలస్యమైన చెల్లింపు కూడా మీ సిబిల్ స్కోర్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, అందుబాటులో ఉన్న క్రెడిట్ అధిక వినియోగం కూడా సిబిల్ స్కోర్‌లను తగ్గించడానికి దారితీస్తుంది.
తరచూ సిబిల్ స్కోర్ చెక్ చేస్తే..
సాధారణంగా సిబిల్ స్కోర్ ని చెక్ చేయడాన్ని రెండు విభాగాలుగా చేశారు. వీటిని సాఫ్ట్ అండ్ హార్డ్ ఎన్ క్వైరీ అని పిలుస్తారు. మీరు దేని కోసం సిబిల్ స్కోర్ తనిఖీ చేస్తున్నారు అనే అంశాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. రుణం లేదా ఖాతా సమీక్ష ప్రయోజనాల కోసం ముందస్తు ఆమోదం కోసం క్రెడిట్ తనిఖీ చేయబడినప్పుడు దానిని సాఫ్ట్ ఎన్క్వైరీ అంటారు. అయితే రుణాన్ని ఆమోదించడానికి లేదా క్రెడిట్‌ను పొడిగించడానికి ముందు రుణ నిర్ణయం తీసుకోవడానికి సిబిల్ చెక్ చేస్తే దీనిని హార్డ్ ఎన్ క్వైరీ అని పిలుస్తారు.
సాఫ్ట్ ఎన్ క్వైరీ సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయనప్పటికీ, హార్ట్ ఎన్ క్వైరీ మాత్రం సిబిల్ తగ్గేలా చేస్తాయి. ఈ ప్రభావం మీ క్రెడిట్ రికార్డుపై కనీసం రెండేళ్ల పాటు ఉంటుంది. ఇది మీ మొదటి 12 నెలల క్రెడిట్ స్కోర్ ని దెబ్బతీస్తుంది.
సరళంగా చెప్పాలంటే, మీ క్రెడిట్ స్కోర్‌ను తరచుగా తనిఖీ చేయడం మానుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. మీ క్రెడిట్ నివేదికను సంవత్సరానికి ఒకసారి. అవసరమైతే, రెండుసార్లు తనిఖీ చేయడం తెలివైన ఆలోచన.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







