Car Loan: కార్‌ లోన్‌ కావాలంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..?

|

Feb 07, 2022 | 10:53 AM

Car Loan: మన దేశంలో కారు కొనడం అంటే జనాలు స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కారు కొనడానికి సహాయం చేస్తాయి.

Car Loan: కార్‌ లోన్‌ కావాలంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..?
Auto Loan
Follow us on

Car Loan: మన దేశంలో కారు కొనడం అంటే జనాలు స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కారు కొనడానికి సహాయం చేస్తాయి. అయితే మీ డ్రీమ్ కారు కోసం లోన్‌ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేదంటే నష్టాన్ని భరించవలసి ఉంటుంది. చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆన్ రోడ్ ధరలో 80 నుంచి 90 శాతం వరకు కారు అసలు ధరతో పాటు పన్నులు చెల్లించి రుణం అందిస్తాయి. కొన్ని బ్యాంకులు లేదా సంస్థలు 100% ఫైనాన్స్ ఇస్తాయి.

క్రెడిట్ చరిత్రను తెలుసుకోండి

కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు క్రెడిట్ స్కోర్ తెలుసుకోకపోవడం పెద్ద తప్పు. తన క్రెడిట్ స్కోర్ తెలిసిన కస్టమర్‌కు కారులోన్‌కి అర్హుడు కాదో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ స్కోరు వెరిఫికేషన్ చేస్తాయి. అలాగే చాలా బ్యాంకులు దీని ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. కాబట్టి సరసమైన రుణం పొందడానికి మీ క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండి కొనడానికి తొందరపడితే కస్టమర్ అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక కస్టమర్ తన క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ లేదా ఆన్‌లైన్ ఖాతాలో క్రెడిట్ స్కోర్‌ గురించి తెలుసుకోవచ్చు.

దీర్ఘకాలిక రుణం తీసుకోవద్దు

తక్కువ EMI చెల్లించడానికి దీర్ఘకాలిక లోన్ ఎంపిక ఆకర్షణీయంగా ఉంటుంది అయితే ఇది మొత్తం వడ్డీని పెంచుతుంది. లాంగ్ టర్మ్ సాధారణంగా అధిక వడ్డీ రేటుతో వస్తుంది. కస్టమర్ ఎక్కువ కాలం పాటు EMIలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక రుణం అంటే కారు విలువ కూడా తగ్గుతుంది. రుణాల కోసం కార్ డీలర్లపై ఆధారపడే బదులు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్న చోట మంచి ఎంపికల కోసం వెతకాలి. వివిధ బ్యాంకులు, క్రెడిట్ ఏజెన్సీలు, ఆన్‌లైన్ రుణదాతలు అందిస్తున్న వడ్డీ రేట్లని తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మంచిది.

Amla Powder: మొటిమలు, నల్లమచ్చలకు ఉసిరి పొడి దివ్య ఔషధం.. ఎలా వాడాలంటే..?

Eyes Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి.. ఏంటో తెలుసుకోండి..?

IND vs WI: విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. ఏ విషయంలో తెలుసా..?