Banks Charges on ATM: ఏటీఎం లో మనీ విత్ డ్రా చేస్తున్నారా? ఏ బ్యాంకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తుందో తెలుసుకోండి..

|

Oct 14, 2022 | 1:29 PM

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచితంగా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తాయి.

Banks Charges on ATM: ఏటీఎం లో మనీ విత్ డ్రా చేస్తున్నారా? ఏ బ్యాంకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తుందో తెలుసుకోండి..
ATM
Follow us on

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచితంగా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తాయి. పరిమితికి మించి చేసే ఆర్థిక, ఆర్థికేతర సేవలపై చార్జీలు విధిస్తాయి. ఇక ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి ఖాతా రకం, డెబిట్ కార్డ్‌లపై తేడా ఉంటుంది. గతేడాది జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఛార్జీల వసూళ్లకు సంబంధించిన నిబంధనలు 1 జనవరి, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ప్రతీ లావాదేవీకి రూ. 21 ఛార్జ్ చేస్తున్నాయి బ్యాంకులు. ఇంతకు ముందు బ్యాంకులు ప్రతీ లావాదేవీకి రూ. 20 వసూలు చేసేవి.

బ్యాంకు వినియోగదారులు ప్రతి నెల వారి బ్యాంక్ ఏటీఎంలలో 5 సార్లు ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. నాన్ మెట్రో కేంద్రాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు.

ఇక, 1 ఆగస్టు 2022నుంచి అన్ని కేంద్రాలలో ఆర్థిక లావాదేవీలపై రూ. 17, ప్రతి ఆర్థికేతర లావాదేవీలకు రూ. 6 ఇంటర్ చేంజ్ రుసుమును విధించడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిని ఇచ్చింది. పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఈ సర్వీస్ ఛార్జీలను వసూలు చేయడానికి ఆర్బీఐ అనుమతిని ఇచ్చింది. ఇక కస్టమర్ కలిగి ఉన్న కార్డు రకాన్ని బట్టి కూడా ప్రధాన బ్యాంకులు కార్డులపై వార్షిక రుసుమును వసూలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

SBI, PNB, HDFC, ICICI, AXIS బ్యాంకులు విధించే వివిధ రకాల ATM ఛార్జీల వివరాలు ఇక్కడ చూడొచ్చు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..