Ather Rizta: అతి పెద్ద సీటుతో ఏథర్ ఫ్యామిలీ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే..

పెద్ద సీటుతో కూడిన ఫ్యామిలీ స్కూటర్ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. పలు దఫాలుగా దానిని పరీక్షించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి ఏథర్ ఈ ఫ్యామిలీ స్కూటర్ టీజర్ ను విడుదల చేసింది. ఏథర్ రిజ్టా పేరుతో అతి పెద్ద సీటు కలిగిన స్కూటర్ గా టీజర్ లో పేర్కొంది. దీనిని ఈ సంవత్సరం చివర్లో జరిగే ఏథర్ కమ్యూనిటీ డే రోజున పరిచయం చేయనుంది.

Ather Rizta: అతి పెద్ద సీటుతో ఏథర్ ఫ్యామిలీ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే..
Ather Rizta Family Scooter

Updated on: Mar 06, 2024 | 6:22 AM

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. లోకల్ అవసరాలకు, సిటీ పరిధిలో ఇవి ఉపయుక్తంగా ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు చెందిన స్కూటర్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో ఏథర్ కొంతకాలం క్రితం ఓ ప్రాజెక్ట్ ను ప్రకటించింది. పెద్ద సీటుతో కూడిన ఫ్యామిలీ స్కూటర్ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. పలు దఫాలుగా దానిని పరీక్షించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి ఏథర్ ఈ ఫ్యామిలీ స్కూటర్ టీజర్ ను విడుదల చేసింది. ఏథర్ రిజ్టా పేరుతో అతి పెద్ద సీటు కలిగిన స్కూటర్ గా టీజర్ లో పేర్కొంది. దీనిని ఈ సంవత్సరం చివర్లో జరిగే ఏథర్ కమ్యూనిటీ డే రోజున పరిచయం చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహత ఈ స్కూటర్కు సంబంధించి సోషల్ మీడియా పోస్ట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూటర్‌లలో తమ స్కూటర్ అతిపెద్ద సీటును కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఏథర్ రిజ్టా XXXXXL సీటు కుటుంబ సౌకర్యం కోసం రూపొందించామని వివరించారు. కాగా ఈ రిజ్టా స్కూటర్లో మార్కెట్లో ఉన్న అన్ని స్కూటర్ల కన్నా ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉండే అవకాశం ఉందని మార్కెట్లో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏథర్ ఎనర్జీలో వీపీ అండ్ మార్కెటింగ్ హెడ్ ప్రాణేష్ ఉర్స్ మాట్లాడుతూ తాము రిజ్టా రూపకల్పన ప్రారంభించినప్పుడు తమ ప్రాధాన్యం కుటుంబాలకు అధిక సౌకర్యంతో కూడిన రైడ్ అందించడమని చెప్పారు. రోజువారీ స్కూటర్ రైడింగ్లో మంచి అనుభూతిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందుకే తాము ఏథర్ రిజ్టాను అత్యంత విశాలమైన సీటుతో నిర్మించామన్నారు.

ఇవి కూడా చదవండి

ఏథర్ రిజ్టాలో ఫీచర్లు..

రిజ్టా గురించి చాలా తక్కువగా తెలిసినప్పటికీ, దీనిని పరీక్షిస్తున్న సమయంలో రెండుసార్లు బయట గుర్తించారు. ఈ క్రమంలో కొన్ని ఫీచర్లు ఆన్ లైన్లో చెబుతున్నారు. సౌలభ్యం, ప్రాక్టికాలిటీని అందించే బ్యాటరీతో నడిచే విభాగంలో కుటుంబ స్కూటర్ కోసం వెతుకుతున్న ప్రేక్షకులను ఏథర్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టమైంది. ఈ స్కూటర్ ప్రస్తుత ఏథర్ 450ల నుంచి పూర్తిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని స్పై షాట్‌లు వెల్లడించాయి.

ఫీచర్ల పరిశీలిస్తే ఏథర్ రిజ్టాను టచ్-ఆధారిత డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, యాప్ ఇంటిగ్రేషన్ కనెక్టివిటీ, మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్లు మొదలైనవి ఉండే అవకాశం ఉంది. స్పోక్-అల్లాయ్ వీల్స్‌, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..