Atal Pension Yojana: గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల పెన్షన్‌.. పూర్తి వివరాలు

|

Jul 14, 2022 | 9:14 AM

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ( APY ) ప్రభుత్వ పెన్షన్ పథకాలలో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ డబ్బు వారి చేతుల్లోకి వస్తుంటుంది..

Atal Pension Yojana: గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల పెన్షన్‌.. పూర్తి వివరాలు
Atal Pension Yojana
Follow us on

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ( APY ) ప్రభుత్వ పెన్షన్ పథకాలలో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ డబ్బు వారి చేతుల్లోకి వస్తుంటుంది. ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. 2021-22 చివరి నాటికి 4 కోట్ల మందికి పైగా అటల్ పెన్షన్ యోజనలో చేరినట్లు కేంద్రం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తెలిపిన వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 99 లక్షలకు పైగా అటల్ పెన్షన్ యోజన ఖాతాలు తెరవబడ్డాయి. మార్చి 2022 చివరి నాటికి ఈ పథకంలో చేరిన వారి సంఖ్య 4.01 కోట్లకు చేరింది. ఈ సంఖ్య పెరగడానికి ఇ-అటల్ పెన్షన్ యోజన కూడా ఒక కారణం. ఈ పథకం ప్రయోజనాన్ని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో అటల్ పెన్షన్ యోజన ఖాతా ఓపెన్‌ చేసుకోవచ్చు. అలాంటి సమయంలో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అటల్ పెన్షన్ యోజనలో ఈ సౌకర్యం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది.

అటల్ పెన్షన్ యోజన ఖాతాను ఎలా తెరవాలి:

మీకు ఆధార్ కార్డ్ ఉంటే చాలా సులభంగా అటల్ పెన్షన్ యోజన ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవవచ్చు. ఈ పథకాన్ని నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా అనుసంధానించవచ్చు. e-APYకి ప్రత్యేక ఛార్జీలు అవసరం లేదని PFRDA పత్రికా ప్రకటన పేర్కొంది. దీని కోసం కస్టమర్ KYC చేయాల్సి ఉంటుంది. ఇందులో కస్టమర్ ఆధార్‌తో నమోదు చేయబడతారు. KYC కోసం రెండు ప్రక్రియలు పేర్కొనబడ్డాయి. ఆఫ్‌లైన్ XML నుండి ఆధార్ KYC, ఆన్‌లైన్ ఆధార్ e-KYC. ఆన్‌లైన్ అటల్ పెన్షన్ యోజన (eAPY)ని ప్రారంభించాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. eKYCలో, బ్యాంక్ రికార్డులలో నమోదైనట్లుగానే వివరాలను ఇవ్వండి. అటల్ పెన్షన్ యోజన ఖాతా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. అందుకే APY మొదటి విడత డబ్బు ఖాతాలోనే ఉండాలి. ఈ మొత్తం రూ. 1000 నుండి రూ. 5000 మధ్య ఉండాలి. ఆధార్ వివరాలను అందించిన తర్వాత మీ ఖాతా ధృవీకరించబడుతుంది. బ్యాంక్ మీ అటల్ పెన్షన్ యోజన ఫారమ్‌ను తిరస్కరిస్తే, ఆ ఫారమ్‌ను సరిచేసి మళ్లీ సమర్పించండి.

ఇవి కూడా చదవండి

eAPY ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి:

☛ ఆన్‌లైన్ APY రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్‌ని సందర్శించండి

☛ బ్యాంక్ పేరును ఎంచుకోండి. బ్యాంక్ ఖాతా నంబర్‌, ఇమెయిల్ ID, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. అలాగే ఆధార్ ఆఫ్‌లైన్ ఇ-కెవైసి XML ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.

☛ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కెవైసి కోసం షేర్ కోడ్ ఎంటర్ చేయండి.

☛ తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేశాక కొనసాగింపుపై క్లిక్ చేయండి.

ఎవరెవరు అర్హులు:

ఈ పథకంలో చేరేందుకు18 నుంచి 40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. 18 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరితే 42 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తుండాలి. అలాగే 40 ఏళ్లవారు మరో 20 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుల వయసు ఎంత ఉన్నా.. వారికి 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు ఉన్నవారు 60 ఏళ్ల తర్వాత తమకు నెలనెల రూ.1000 పెన్షన్‌ రావాలంటే నెలకు రూ.42 చెల్లించాలి. 3 లేదా 6 నెలలకోసారి చెల్లంఇచే వారికీ ఈ ప్రీమియం రూ.125, రూ.248గా ఉంటుంది. నెలకు రూ.2,000,రూ.3000, రూ.4000, రూ.5000 పెన్షన్‌ కావాలంటే ప్రీమియం పెరుగుతుంది.ఈ స్కీమ్‌లో నెలకు కనిష్టంగా రూ.5 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు. ఒక వేల లబ్దిదారులు 60 ఏళ్ల లోపు మరణించినట్లయితే భర్త లేదా, భార్యకు ప్రీమియంలు కొనసాగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి