
ఈ మధ్యకాలంలో కొందరు ఆధార్ కార్డులను సైతం ఫేక్ చేయడం జరుగుతోంది. అలాగే ఆధార్ కార్డుల వినియోగం ద్వారా మరికొందరికి ప్రైవసీ, సెక్యూరిటీకి భంగం కలుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ప్రారంభించింది. ఆధార్ వివరాలను డిజిటల్‌గా పంచుకునే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు గోప్యతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం.. ఈ కొత్త ఆధార్ ధృవీకరణ యాప్‌ను ముందుకు తీసుకొచ్చింది.
ఈ విషయాన్ని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీని ఫీచర్ల గురించి వివరిస్తూ.. ఇది వినియోగదారుడి నియంత్రణ, సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. ఫేస్ ID ప్రామాణికంగా, ఒరిజినల్ కార్డులు, ఫోటో కాపీలకు ఎలాంటి అవసరం లేకుండా చేస్తుంది.
ఈ సరికొత్త యాప్ ఆధార్ ధృవీకరణను UPI చెల్లింపుల మాదిరిగా సులభతరం చేయడంతో పాటు యూజర్లకు ఎలాంటి ఆటంకాలు లేని డిజిటల్ అటెంటికేషన్‌ను సులభతరం చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త యాప్‌లో యూజర్లు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాళ్లకు అవసరమైన డేటాను మాత్రమే సురక్షితంగా పంచుకోవచ్చు. ఈ టెక్-ఫార్వర్డ్ విధానం గోప్యతను నిర్ధారిస్తుందని, స్కాన్ చేసిన జిరాక్స్ కాపీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొంది కేంద్రం.
New Aadhaar App
Face ID authentication via mobile app❌ No physical card
❌ No photocopies🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025