ఢిల్లీలోని మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని హామీ ఇచ్చారు. 2024-25 బడ్జెట్‌లో రూ.2,000 కోట్ల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందుతారు? దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
మీరు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగలరా?
రేపటి నుంచి అంటే డిసెంబర్ 13 నుంచి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మాన్యువల్‌గా ఇంటింటికీ వెళ్లి మహిళల పేర్లను నమోదు చేసుకుంటారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం పోర్టల్ అందుబాటులో ఉండదు.
మహిళా సమ్మాన్ యోజనకు అర్హత ఏమిటి?
ఢిల్లీ అధికారిక ఓటర్లుగా ఉన్న మహిళలు మాత్రమే మహిళా సమ్మాన్ యోజన ప్రయోజనాన్ని పొందుతారు. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు మాత్రమే దాని ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 60 సంవత్సరాలు. ఒక మహిళకు నాలుగు చక్రాల వాహనం ఉంటే, ఆమెకు ఈ పథకం ప్రయోజనం ఉండదు.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు అర్హత ఏమిటి?
జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడానికి నేను అతిషీతో కలిసి పనిచేశాను.. ఇప్పుడు ఇది అమలు చేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది మా వైపు నుండి ఒక ఉపకారం కాదు.. మహిళలు తమ కుటుంబాన్ని నడుపుకొంటున్నారు.. వారు పిల్లలకు ఎంతగానో విలువ ఇస్తున్నారని అన్నారు. ఆ మహిళల విలువ మరింతగా పెంచేందుకు ఈ పథకం ప్రకటించినట్లు చెప్పారు. మన భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో మనం మహిళలకు సహాయం చేయగలిగితే అది మన అదృష్టం.. అని అన్నారు.
ఇది చదవండి: Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి