PF Withdraw: మీరు పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేస్తున్నారా? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీ సొమ్ము ఫసక్..
భారత ప్రభుత్వ మద్దతుతో ఈపీఎఫ్‌లో పెట్టుబడిపై 8.1 శాతం వడ్డీని పొందవచ్చు. ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ కార్మికుల మూల వేతనంలో 12 శాతం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ పథకం అర్హులైన ఉద్యోగులందరికీ పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అనుకోని ఖర్చుల వల్ల ముందుగానే పీఎఫ్ సొమ్ము నుంచి కొంత భాగాన్ని ముందస్తుగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. భారత ప్రభుత్వ మద్దతుతో ఈపీఎఫ్‌లో పెట్టుబడిపై 8.1 శాతం వడ్డీని పొందవచ్చు. ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ కార్మికుల మూల వేతనంలో 12 శాతం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ పథకం అర్హులైన ఉద్యోగులందరికీ పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అనుకోని ఖర్చుల వల్ల ముందుగానే పీఎఫ్ సొమ్ము నుంచి కొంత భాగాన్ని ముందస్తుగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే ఇలా ఉపసంహరించుకునేందుకు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి సభ్యులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
నిరుద్యోగం
ఒక వ్యక్తి ఒక నెలకు పైగా పని లేకుండా ఉంటే వారు సేకరించిన ఈపీఎఫ్ మొత్తంలో 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. వారు రెండు నెలలకు పైగా నిరుద్యోగులుగా ఉంటే మిగిలిన 25 శాతం కూడా పొందవచ్చు. ఈ షరతు కాకుండా పదవీ విరమణ తర్వాత మాత్రమే మొత్తం మొత్తాన్ని తీసుకోవచ్చు.
మెడికల్ ఎమర్జెన్సీలు
ఈపీఎఫ్ సభ్యుడు తనకు లేదా తక్షణ కుటుంబ సభ్యులకు అత్యవసర వైద్య చికిత్స కోసం తమ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ అనేది వడ్డీతో పాటు ఉద్యోగి వాటా లేదా ఆరు నెలల ప్రాథమిక వేతనం, డియర్నెస్ అలవెన్స్ ఏది తక్కువైతే దాన్ని అందిస్తున్నారు.
గృహ రుణ చెల్లింపు
గృహ రుణ రుణాన్ని చెల్లించడానికి సభ్యుడు కార్పస్‌లో 90 శాతం వరకూ విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. ఉద్యోగి కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తి చేసినట్లయితే మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
దరఖాస్తు ఇలా
ఆఫ్‌లైన్ దరఖాస్తు
ఈపీఎంఫ్ఓ వెబ్సైట్ నుంచి కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (ఆధార్)/కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (నాన్-ఆధార్) డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును పూరించాలి. మీ అధికార పరిధిలో ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించే ముందు యజమాని ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంది.
ఆన్లైన్లో దరఖాస్తు విధానం
- ముందుగా యూఏఎన్ పోర్టల్‌ని సందర్శించి లాగిన్ అవ్వాలి.
- తర్వాత మీ కేవైసీ వివరాలు ధృవీకరించారో? లేదో? తనిఖీ చేయాలి.
- ఆన్లైన్ సేవలకు వెళ్లి మెను నుంచి ‘క్లెయిమ్ (ఫారం-31, 19, 10సీ & 10డీ)ను ఎంచుకోవాలి.
- అనంతరం మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ధ్రువీకరించాలి.
- తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేసి మీకు అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకోవాలి
- ఉపసంహరణ కోసం పీఎఫ్ అడ్వాన్స్‌ని ఎంచుకోవడం ఉత్తమం.
- మీ దరఖాస్తును సమర్పించాలి. అనంతరం మీ ఫీల్డ్ ఆఫీస్‌లో ధ్రువీకరణ అనంతరం 15 నుంచి 20 రోజుల్లో డబ్బు జమ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి