Online shopping tips: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? ఈ చిట్కాలతో ఆ సమస్యలు దూరం

|

Oct 02, 2024 | 6:00 PM

పండగల సందర్భంగా ప్రజలందరూ షాపింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. దుస్తులు దగ్గరి నుంచి ఇంట్లోకి అవసరమైన అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ వ్యాపారం బాగా విస్తరించింది. వివిధ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు అనేక డిస్కౌంట్లతో వివిధ వస్తువులను విక్రయిస్తున్నాయి. మార్కెట్ ధరతో పోల్చితే చాలా తక్కువకు అమ్మకాలు జరుపుతున్నాయి.

Online shopping tips: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? ఈ చిట్కాలతో ఆ సమస్యలు దూరం
Online Sale
Follow us on

పండగల సందర్భంగా ప్రజలందరూ షాపింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. దుస్తులు దగ్గరి నుంచి ఇంట్లోకి అవసరమైన అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ వ్యాపారం బాగా విస్తరించింది. వివిధ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు అనేక డిస్కౌంట్లతో వివిధ వస్తువులను విక్రయిస్తున్నాయి. మార్కెట్ ధరతో పోల్చితే చాలా తక్కువకు అమ్మకాలు జరుపుతున్నాయి. ప్రజలు కూడా జోరుగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండడమే దీని కారణం. అలాగే షాపుల్లో ఉండే వస్తువులకన్నా ఆన్ లైన్ షాపింగ్ లో లేటెస్ట్ మోడళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ క్రింద తెలిపిన చిట్కాలను పాటిస్తే సురక్షితంగా, నష్టం లేకుండా ఆన్ లైన్ షాపింగ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్ పరిశీలన

ప్రసిద్ధి చెందిన ఇ-కామర్స్ సైట్స్ నుంచి మాత్రమే షాపింగ్ చేయాలి. కొనుగోలు కు ముందే వెబ్ సైట్ ను పరిశీలించాలి. లోగోలతో ఇతర కస్టమర్ల సమీక్షలు, రేటింగ్ ను చూడాలి. ఎందుకంటే కొందరు సైబర్ మోసగాళ్లు నకిలీ వెబ్ సైట్లు రూపొందించి, ఆన్ లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.

ఆఫర్లు

వ్యాపారాన్ని విస్తరించడానికి ఆన్ లైన్ సంస్థలు తమ వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి. అవి నిజమా, కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. ఆయా వస్తువుల ధరలను మిగిలిన సైట్ లలోనూ గమనించాలి. ఏది ఏమైనా మీకు అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసుకోవాలి

రిటర్న్, రీఫండ్

వస్తువులను కొనుగోలు చేసేముందు రిటర్న్, రీఫండ్ విధానాలను బాగా చదవాలి. కొన్ని సంస్థలు ఈ ప్రక్రియలో కొన్ని నిబంధనలు విధిస్తాయి. వాటి కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తాయి. కాబట్టి వస్తువులను కొనుగోలు చేసేముందు నిబంధనలు చదవడం అవసరం.

నాణ్యత

వస్తువుల నాణ్యతను పరిశీలించడం చాలా ముఖ్యం. విక్రేత రేటింగ్, ఉత్పత్తి సమీక్షలను తనిఖీ చేయాలి. ఆ వస్తువు విలువ మార్కెట్ లో కంటే అతి తక్కువగా ఉంటే ఆలోచించాలి. కొన్ని ఆన్ లైన్ సైట్లలో నాణ్యత లేని వస్తువులను విక్రయించే అవకాశం ఉంది.

వ్యక్తిగత సమాచారం

ఆన్ లైన్ షాపింగ్ లో లావాదేవీలకు అవసరమైన సమాచారం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవసరానికి మంచి వివరాలు అడుగుతున్న సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఉంది.

సురక్షిత చెల్లింపులు

లావాదేవీల కోసం క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇ-కామర్స్ సైట్ లలో మీ చెల్లింపు వివరాలను సేవ్ చేయకండి.

ఫిషింగ్ స్కామ్ లు

పండగల సమయంలో ఫిషింగ్ స్కామ్ లు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక డీల్ పేరుతో వచ్చే ఇ-మెయిల్, టెక్స్ట్ లు, లింక్ లను క్లిక్ చేయకండి. మీ బ్రౌజర్ ద్వారా నేరుగా ఇ-కామర్స్ సైట్ లను సందర్శించడం మేలు.

బడ్జెట్ ప్లానింగ్

ఆన్ లైన్ లో వివిధ వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు పెడతారు. అందువల్ల వాటి అవసరం లేకపోయినా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకు అవసరమైన వస్తువులను జాబితాను ముందుగానే రూపొందించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి