April New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసుకోండి

|

Mar 18, 2023 | 5:00 AM

ప్రతి నెల ప్రారంభంలో మీ ప్రభుత్వ ఉద్యోగంలో లేదా మీ రోజువారీ జీవితంలో అవసరమైన వాటిలో చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం నిబంధనలను..

April New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసుకోండి
New Rules
Follow us on

ప్రతి నెల ప్రారంభంలో మీ ప్రభుత్వ ఉద్యోగంలో లేదా మీ రోజువారీ జీవితంలో అవసరమైన వాటిలో చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్చి నెల ముగియడానికి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు మార్చి 31 లోపు పూర్తి చేయవలసిన అనేక ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2023 నుంచి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి ఏప్రిల్ 1, 2023 నుంచి పలు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. ఆ నిబంధనలు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ పనులు చేస్తే మీరు తర్వాత ఈ మార్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆధార్ – పాన్ లింక్: ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు కార్డులను జోడించడానికి వినియోగదారులకు అనేక పొడిగింపులు ఇచ్చింది. వీటి అనుసంధానం గడువు మార్చి 2023. ఇంతకుముందు ఉచితంగా ఉన్న ఈ ప్రక్రియకు ఇప్పుడు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇంతకు ముందు పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయకుంటే మార్చి 31 చివరి తేదీ. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. ఇప్పటికీ పాన్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే వెంటనే చేయండి.

బంగారం కొనుగోలుకు కొత్త నిబంధనలు: మీరు బంగారం కొనడానికి లేదా అమ్మడానికి వెళ్తున్నట్లయితే ఈ వార్త మీకు ముఖ్యమైనది. బంగారం, బంగారు ఆభరణాల కొనుగోలు, అమ్మకం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. 31 మార్చి 2023 తర్వాత, కొత్త హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులను విక్రయించలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల హాల్‌మార్క్‌లు మాత్రమే ఆమోదించబడతాయి. ఆరు అంకెల హాల్‌మార్క్ లేకుండా బంగారం గానీ, అభరణాలు గానీ కొనుగోలు, అమ్మకం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటే PFRDA, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ నియమం ఉపసంహరణకు సంబంధించినది. డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు సభ్యులు కొన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలను అప్‌లోడ్ చేయకుండా NPS నుండి ఉపసంహరణ సాధ్యం కాదు. మీరు ఇప్పుడు KYC పత్రాలను అందించాలి. పత్రాలలో ఏదైనా తప్పులు ఉంటే, మీ డబ్బు నిలిపివేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి