ఐఫోన్‌లో స్పై వేర్..తన కస్టమర్లకు యాపిల్ కంపెనీ అలర్ట్ నోటీసులు పంపింది.ఐఫోన్ వినియోగదారుల్లో పలువురి ఫోన్లను స్పై వేర్ అటాక్ చేసిందని హెచ్చరించింది.పెగాసస్ తరహాలో ఈ స్పైవేర్ ఇప్పటికే పలు ఫోన్లలోకి చేరినట్లు అనుమానం వ్యక్తం చేసింది. భారత్‌తో పాటు 91 దేశాల కస్టమర్లకు థ్రెట్ నోటీసులు పంపినట్లు సమాచారం..
ఐతే యాపిల్ కంపెనీ ఇలా హెచ్చరికలు చేయడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో 20 మంది ఇండియన్ యూజర్స్‌కి ఈ తరహా వార్నింగ్స్ వచ్చాయి. కాంగ్రెస్ MP శశిథరూర్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, టీఎంసీ లీడర్ మహువా మొయిత్రాల ఫోన్లలో పెగాసస్ స్పై వేర్ చేరిందని హెచ్చరించింది..ఐతే ఈ స్పై వేర్ అటాక్ వెనక ప్రభుత్వ హస్తం ఉందన్న యాపిల్.. ఆ తర్వాత మాటమార్చింది..ప్రభుత్వ హస్తం ఉందనేందుకు ఆధారాలు లేవని వివరణ ఇచ్చింది. తాజాగా మరోసారి యాపిల్ అలర్ట్ నోటీసులు పంపింది. మెర్సినరీ స్పైవేర్‌తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్నింగ్ నోటిఫికేషన్‌లో చెప్పింది. మీ ఫోన్ అటాక్ కు గురైందనే విషయంలో స్పష్టతతోనే ఈ నోటీసులు పంపుతున్నాం. అందువల్ల సీరియస్ గా తీసుకోండి’ అంటూ యాపిల్ తన నోటీసులలో పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..