Apple Cashback Offer: భారత వినియోగదారులకు యాపిల్ స్టోర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో 44,900, ఆపైన ఆర్డర్ చేసే వినియోగదారులకు రూ.5వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ ఈనెల 21న ప్రారంభమై 28వ తేదీలో ముగియనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈఎంఐలకు మాత్రమే ఇది వర్తిస్తుందని యాపిల్ తెలిపింది. ఆరు నెలల ఈఎంఐలకు మాత్రమే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. రూ.44,900తో సింగిల్ ఆర్డర్‌కు కానీ, అంతే మొత్తంలో కొనుగోలు చేసే పలు ఆర్డర్లకు కానీ రూ.5వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ పేర్కొంది. అయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తే ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత నుంచి వారం రోజుల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
TV Prices: కొత్తేడాదిలో టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే తొందరపడండి… ఎందుకో తెలుసా..?