Voter Name Search: SIR తర్వాత ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా..? లేదా..? ఒకే క్లిక్‌తో ఇలా తెలుసుకోవచ్చు..
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎస్‌ఐఆర్ తర్వాత మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో.. లేదో తెలుసుకోవాలి. ఆన్లైన్ ద్వారా మీరు సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే..

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. నవంబర్ 13వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా.. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 26వ తేదీన జరగనుండగా.. రెండో దశ పోలింగ్ నవంబర్ 29వ తేదీన జరగనున్నాయి. ఇక మూడో దశ పోలింగ్ డిసెంబర్ 2వ తేదీన జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశ ఎన్నికలకు నవంబర్ 13న నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ 16వ తేదీన రానుంది. ఆ తర్వాత నవంబర్ 19న మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 13,219 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ఎన్నికల సంఘం గడువు మళ్లీ పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంలో కొంతమంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఓటు కోల్పోయినవారు తమ డాక్యుమెంట్లను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో.. లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటుంటే.. ఖచ్చితంగా మీ ఓటు చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా మీరు సింపుల్‌గా ఇది చూసుకోవచ్చు.
మీ ఓటు ఉందో.. లేదో ఇలా చెక్ చేసుకోండి
-ముందుగా ఈసీ సిటిజన్ సర్వీస్ పోర్టల్ https://voters.eci.gov.in/ను సందర్శించండి
-హోమ్ పేజీలో క్రింది భాగంలో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
-అందులో మీ మొబైల్ నెంబర్ లేదా మీ పేరు లేదా మీ ఓటర్ ఐడీ నెంబర్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోండి
-ఓటర్ ఐడీ ఆప్షన్ ఎంచుకుంటే మీ ఓటర్ ఐడీ నెంబర్, స్టేట్ వివరాలు నమోదు చేయాలి. అనంతరం క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేస్తే మీ వివరాలు అందుతాయి
-సెర్చ్ బై మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే ఓటీపీ అందుతుంది. ఓటీపీ నమోదు చేసి సెర్చ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది
-సెర్చ్ బై డీటైల్స్ ఆప్షన్ ద్వారా మీ వివరాలు తెలుసుకోవాలంటే మీ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
