Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goutham reddy : ఏపీలో 3 కాన్సెప్ట్ సిటీస్.. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు.. మొత్తంగా 13 జిల్లాలను అభివృద్ధివైపు తీసుకెళ్తాయి : గౌతం రెడ్డి

2023 డిసెంబర్‌ నాటికి భోగాపురం పూర్తిచేస్తామని.. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు.. మొత్తంగా 13 జిల్లాలను టచ్ చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు..

Goutham reddy : ఏపీలో 3 కాన్సెప్ట్ సిటీస్..   మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు.. మొత్తంగా  13 జిల్లాలను అభివృద్ధివైపు తీసుకెళ్తాయి : గౌతం రెడ్డి
Mekapati
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 09, 2021 | 10:33 AM

Three concept cities : కొవిడ్‌-19 తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల జీడీపీ తగ్గిందని.. అయితే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంక్షేమంతోపాటుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 ఏడాది టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. సీఎం జగన్‌ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పిన ఆయన, పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను అవలంభిస్తున్నామని చెప్పారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పరిశ్రమల శాఖ ఉద్యోగులు గౌతమ్‌రెడ్డి, ఏపీఐసీసీ చైర్మన్ రోజాను మేకపాటి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

2019 తర్వాత జీడీపీ, పెట్టుబడులు చాలా దెబ్బతిన్నాయని, అయినా రాష్ట్రంలో 1.58 శాతం గ్రోత్ నమోదు చేశామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. నవరత్నాలు వల్ల మాత్రమే ఈ గ్రోత్ రేట్ పెరిగిందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులను అందుబాటులోకి తేవడం ద్వారా పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు వస్తాయని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

2023 డిసెంబర్‌ నాటికి భోగాపురం పూర్తిచేస్తామని.. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు.. మొత్తంగా 13 జిల్లాలను టచ్ చేస్తున్నాయన్నారు. 3 కాన్సెప్ట్ సిటీస్‌ను సీఎం ప్లాన్‌ చేశారని.. ఆగస్ట్‌లో మరోసారి టెక్స్‌టైల్‌, ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు చెల్లిస్తామన్నారు. ఇండస్ట్రీలు రావడానికి బాక్ ఎండ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Read also : Sharmila : జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై నేడు సన్నాహాక సమావేశం.. అన్ని స్థాయిల్లో అడహక్ కమిటీలు ప్రకటించనున్న షర్మిల