Air India: ఈ విమానం ‘చెత్త’.. ఈ జర్నీ ‘ఓ పీడకల’.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుడి పోస్ట్ వైరల్..

|

Sep 20, 2024 | 3:13 PM

బిజినెస్ క్లాస్ టికెట్ కొని లాంగ్ జర్నీ చేయాలనుకున్న ఓ కంపెనీ సీఈఓకి పీడకల లాంటి అనుభవం ఎదురైంది. బిజినెస్ క్లాస్ కోచ్ లోపలి పరిస్థితులు చూసి ఆయన షాక్ అయ్యారు. తన 15 గంటల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకున్న ఆ సీఈఓకు ఎప్పుడు ఫ్లైట్ దిగపోదామా అని ఫీలయ్యేలా చేసింది. దీంతో ఆయన ఆ విమానంలోని పరిస్థితులను వీడియో తీసి.. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఇదో చెత్త ప్రయాణం అంటూ కోట్ చేశారు.

Air India: ఈ విమానం ‘చెత్త’.. ఈ జర్నీ ‘ఓ పీడకల’.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుడి పోస్ట్ వైరల్..
Air India Flight
Follow us on

విమాన ప్రయాణం అంటేనే పెద్ద విషయంగా భావించే వారు ఉన్నారు. అందులోనూ ఇక బిజినెస్ క్లాస్ అంటే లగ్జరీతో కూడిన ప్రయాణం. సంపన్నులు, సెలెబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఈ బిజినెస్ క్లాస్ లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారు. ఎందుకంటే దానిలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఆ టికెట్ ధర కూడా చాలా రెట్లు అధికంగా ఉంటుంది. అయితే అలాంటి బిజినెస్ క్లాస్ టికెట్ కొని లాంగ్ జర్నీ చేయాలనుకున్న ఓ కంపెనీ సీఈఓకి పీడకల లాంటి అనుభవం ఎదురైంది. బిజినెస్ క్లాస్ కోచ్ లోపలి పరిస్థితులు చూసి ఆయన షాక్ అయ్యారు. తన 15 గంటల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకున్న ఆ సీఈఓకు ఎప్పుడు ఫ్లైట్ దిగపోదామా అని ఫీలయ్యేలా చేసింది. దీంతో ఆయన ఆ విమానంలోని పరిస్థితులను వీడియో తీసి.. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఇదో చెత్త ప్రయాణం అంటూ కోట్ చేశారు. ఎవరా సీఈఓ? ఎక్కడది ఆ ఫ్లైట్? అసలేం జరిగింది? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

దారుణమైన సేవలు..

చికాగో నుంచి న్యూఢిల్లీకి ఇండో అమెరికన్ వెళ్లాలని నిర్ణయించుకొని టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆ ఫ్లైట్ తనకు చాలా దారుణమైన సేవలను అందించిందని ఆయన విమర్శించారు. కాపటెల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అనిల్ పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని ఓ పోస్టు రూపంలో వ్యక్తం చేశాడు- ఇది తన “చెత్త” అనుభవంగా పేర్కొన్నారు. తన ఫ్లైట్ వివరాలను పంచుకుంటూ, “నేను ఇటీవల చికాగో నుంచి ఢిల్లీకి 15 గంటల నాన్‌స్టాప్ ప్రయాణానికి బిజినెస్ క్లాస్ కి బుక్ చేశారు. ఆ ప్రయాణం నాకు ఆహ్లాదకరంగా లేదు. గతంలో ఎయిర్ ఇండియా గురించి నేను ప్రతికూల విషయాలు విన్నాను, కానీ నేను అలా ఉండదని ఆశించాను. కొత్త నిర్వహణలో ఇటీవలి మార్పులు అనుభవాన్ని మెరుగుపరుస్తాయని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు.”

వీడియోను ఆయన పంచుకుంటూ.. “నేను ఎన్నడూ లేనంత చెత్త ఫస్ట్-క్లాస్ క్యాబిన్‌ని మీకు చూపిస్తాను నాతో రండి. ఇది చికాగో టు ఢిల్లీ, నాన్‌స్టాప్ ఎయిర్ ఇండియా ఫ్లైట్. నేను ప్రయాణించాల్సిన దూరం 2,50,000 మైళ్లు. వన్ వే కోసం దీని టికెట్ ధర 6,300 డాలర్లు. అంటే రూ. 5.27లక్షలు. ఇక్కడ ఫ్లైట్ లో పరిస్థితి ఇది. ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి, ప్రతి కంపార్ట్‌మెంట్‌లో వస్తువులు కదులుతున్నాయి, దానిపై బూజు ఉంది.” అంటూ ఆయన కోట్ చేశారు. అలాగే అందులో ఉండాల్సిన 30శాతం వస్తువులు కూడా అందుబాటులో లేవని ఆయన ఫిర్యాదు చేశారు. ఆహారం విషయంలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. గింజలు, సమోసాలు, సూప్ ఆర్డర్ చేశానని. సమోసాలు యావరేజ్ గా ఉన్నాయని.. సూప్ మాత్రం కాస్త రుచిగానే ఉందన్నారు. ఈ విమానంలో అదొక్కటే మంచి విషయం అని ఆయన వివరించారు.

‘ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్ 15 ప్రయాణ సమయంలో అసలు పనిచేయలేదు. సిస్టమ్ మొత్తం విరిగిపోయింది. వారు వాటిని ఉంచడానికి గోడలపై టేప్‌లు వేశారు. సిబ్బంది దానిని నాలుగైదు సార్లు రీసెట్ చేశారు. కానీ ఏమీ పని చేయలేదు. ఈ ప్రయాణం ఒక పీడకల’ అంటూ ఆయన తన అనుభవాన్ని షేర్ చేశారు.

దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. కామెంట్లు చేస్తున్నారు. యాజమాన్యం మారినా.. పరిస్థితులు మారలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..