దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ఎరా ప్రారంభమైంది. రోజురోజుకీ కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. వినియోగదారులు కూడా లేటెస్ట్ మోడల్స్, వాటిలోని ఫీచర్స్, రేంజ్, పనితీరు ఆధారంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త మేడ్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. గ్రీవ్స్ కాటన్ కు అనుబంధంగా యాంపియర్ కంపెనీ ఈ స్కూటర్ వచ్చింది. దీని పేరు యాంపియర్ నెక్సస్. ఈఎస్, ఎస్టీ వేరియంట్లలో ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా గ్రీవ్స్ కాటన్ నుంచి ఇప్పటికే పలు కార్లు, ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ యాంపియర్ నెక్సస్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే సింపుల్ అండ్ క్లీన్ గా ఉంది. ఫ్యామిలీలకు తగిన విధంగా దీనిని రూపొందించారు. పైకి కనిపించే విధంగా ఎలాంటి నట్లు, బోట్లు లేవు. దీనిని స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా బ్లూటూత్ సదుపాయం ఇచ్చారు. అంతేకాక దీనిలో ఏడు అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో మంచి గ్రాఫిక్స్, ఫంక్షనాలిటీని అందిస్తుంది. 24 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. 15యాంప్ చార్జర్ ఉంటుంది. ఇది మూడు గంటల్లోనే బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తుంది. నెక్సస్ కి మొత్తం ఎల్ఈడీ లైటింగ్ అందించారు. ఎయిర్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట శక్తి 4కేడబ్ల్యూ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 136 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. గరిష్టంగా గంటలకు 93 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
యాంపియర్ నెక్సస్ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఈఎస్, ఎస్టీ. ఇవి జన్ స్కర్ ఆక్వా, ఇండియన్ రెడ్, లూనార్ వైట్ అండ్ స్టీల్ గ్రే వంటి రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ వేరియంట్ యాంపియర్ నెక్సస్ ఈఎస్ ధర రూ. 1.10లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. అలాగే హై వేరియంట్ ధర రూ. 1.20 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ స్కూటర్ డిజైన్, లుక్ పరంగా కొత్తగా ఉందని, పనితీరు ఆశించిన రీతిలోనే ఉందని వినియోగించిన వారు రివ్యూలు ఇస్తున్నారు. రేంజ్ కూడా 136కిలోమీటర్లు ఉండటం వినియోగదారులకు మేలు చేస్తుందని వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..