EV Scooter: ఆ కంపెనీకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్.. ఆకర్షిస్తున్న ఫీచర్స్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో స్కూటర్ల ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని ఈవీ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ కంపెనీకు సంబంధించిన ఆంపియర్ నెక్సస్ ఈవీ స్కూటర్‌కు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ వరించింది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EV Scooter: ఆ కంపెనీకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్.. ఆకర్షిస్తున్న ఫీచర్స్
Ampere Nexus

Updated on: May 06, 2025 | 6:59 PM

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తన ఈవీ స్కూటర్లతో ప్రజలను అమితంగా ఆకర్షిస్తుంది. 2025 బైక్ ఇండియా అవార్డుల సందర్భంగా ఆంపియర్ నెక్సస్ ఈవీ స్కూటర్‌కు  ‘ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను గెలుచుకుంది. మార్కెట్లో వాల్యూ యాడెడ్ ఈ-స్కూటర్లలో ఒకటిగా గుర్తించారు. ఈ స్కూటర్ నవంబర్ 2024లో ఇండియా డిజైన్ మార్క్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ మోడల్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 10,000 ప్లస్ కిలోమీటర్లు ప్రయాణించిన రికార్డును కూడా కలిగి ఉంది. ఈ అవార్డుపై గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ కె. విజయ కుమార్ మాట్లాడుతూ ఈ గుర్తింపు నిజంగా గౌరవంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా సురక్షితమైన, స్మార్ట్ ఈవీలను అందుబాటులోకి తీసుకురావాలనే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొన్నారు. 

ఆంపియర్ నెక్సస్ ఈవీ భారతదేశంలో రూ. 1.14 లక్షల ధరతో ప్రారంభించారు. అయితే టాప్ మోడల్ ధర రూ. 1.24 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ మొత్తం 4 రంగుల ఎంపికల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఈవీ పోర్టబుల్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 136 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 93 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఈ స్కూటర్ బ్యాటరీని కేవలం 3 గంటల్లోనే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఆంపియర్ నెక్సస్ సురక్షితమైన, మన్నికైన ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడంతో అత్యాధునిక సాంకేతికత ఈ బ్యాటరీ సొంతం 

గ్రీవ్స్ కంపెనీ కొత్త అండర్‌బోన్ ఛాసిస్‌ను ఉపయోగించింది. దీనికి ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.ఈ స్కూటర్ స్టైలిష్ 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై నడుస్తుంది. మెరుగైన గ్రిప్ కోసం ఎంఆర్ఎఫ్ టైర్లతో వస్తుంది. బ్రేకింగ్ విధుల కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఈ స్కూటర్ ప్రత్యేకత. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి