Amazon Bazaar: చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు అమెజాన్ కీలక చర్యలు.. ప్రత్యేక యాప్ దిశగా అడుగులు

|

Feb 23, 2024 | 7:30 PM

తాజాగా అమెజాన్ తక్కువ ధరకు, బ్రాండ్ లేని ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులను కస్టమర్లకు విలువనిచ్చేలా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ బజార్‌ ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెజాన్ బజార్ ప్రస్తుతం అమ్మకందారులను ఆన్‌బోర్డింగ్ చేసే ప్రక్రియలో ఉంది. ముఖ్యంగా దుస్తులు, గడియారాలు, బూట్లు, నగలు ఇతర సామగ్రి అంటే రూ.600 కంటే తక్కువ ధరతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి చిన్న వ్యాపారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది.

Amazon Bazaar: చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు అమెజాన్ కీలక చర్యలు.. ప్రత్యేక యాప్ దిశగా అడుగులు
Amazon Bazaar
Follow us on

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇటీవలకాలంలో ఆన్‌లైన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏ-జియో వంటి యాప్స్ ద్వారా భారతదేశంలోని వినియోగదారులు కొనుగోళ్లు పెరిగాయి. అయితే ఆయా యాప్స్‌లోని వస్తువుల విషయంలో ఒక్కోసారి మోసపోయినా ఈ-కామర్స్ సైట్స్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా అమెజాన్ తక్కువ ధరకు, బ్రాండ్ లేని ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులను కస్టమర్లకు విలువనిచ్చేలా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ బజార్‌ ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెజాన్ బజార్ ప్రస్తుతం అమ్మకందారులను ఆన్‌బోర్డింగ్ చేసే ప్రక్రియలో ఉంది. ముఖ్యంగా దుస్తులు, గడియారాలు, బూట్లు, నగలు ఇతర సామగ్రి అంటే రూ.600 కంటే తక్కువ ధరతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి చిన్న వ్యాపారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది. అమెజాన్ బజార్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

మాస్-మార్కెట్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించినందున భారతీయ కస్టమర్లను ఆకట్టుకుంనేందుకు అమెజాన్ ఈ చర్యలు తీసుకుంటని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మీషో, ఫ్లిప్‌కార్ట్‌నకు సంబంధించిన షాప్సీ ఇప్పటికే ఈ తరహా చర్యలు తీీసుకున్నాయి. అలాగే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ-జియో స్ట్రీట్ అనే తక్కువ ధర ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తోంది. అమెజాన్ వ్యాపారులకు రెఫరల్ ఫ్రీ సర్వీసులను ప్రతిపాదిస్తుంది. ఇది తక్కువ సగటు అమ్మకపు ధరలతో (ఏఎస్‌పీలు) ఉత్పత్తులకు కీలకంగా మీషో విక్రయదారులకు ప్రకటనలు, లాజిస్టిక్స్ సేవల నుండి ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పుడు జీరో-కమీషన్ మోడల్‌లో పనిచేస్తుంది.అయితే మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్’లా గిడ్డంగులతో పాటు లాజిస్టిక్‌ల సర్వీసుల కలిగి ఉండదు లేదా నిర్వహించదు .

అయితే భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌నకు సంబంధించిన మింత్రాలా అమెజాన్ ఫ్యాషన్ విజయవంతం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెజాన్ బజార్‌ ద్వారా మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి మరో మరొక ప్రయత్నంగా నిపుణులు అమెజాన్ చర్యలను భావిస్తున్నారు. జనవరిలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం అమెజాన్ ఇండియాకు సంబంధించిన వినియోగదారు వృద్ధి డిసెంబర్ 2023లో 13 శాతం మాత్రమే ఉంది. ముఖ్యంగా అధిక ప్రీమియం ఆఫర్ల కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మరోవైపు ఇదే కాలంలో ఫ్లిప్‌కార్ట్ 21 శాతం, మీషో 32 శాతం వినియోగదారుల వృద్ధిని నమోదు చేశాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి