సెప్టెంబర్ నెల సగం గడిచిపోయింది. 2000 రూపాయల నోట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనెలతో 2000 నోటుకు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడుతోంది. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ రూ.2000కి సంబంధించి కీలక సమాచారం ఇచ్చింది. ఇందు కోసం కొత్త నిబంధన కూడా రూపొందించింది. ఈ-కామర్స్ దిగ్గజం క్యాష్ ఆన్ డెలివరీ సేవపై రూ.2000 నోటును ఆమోదించడానికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేసింది.
క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) చెల్లింపులు, క్యాష్‌లోడ్ కోసం సెప్టెంబర్ 19 నుంచి రూ.2,000 నోట్లను నగదుగా స్వీకరించబోమని ఈ-కామర్స్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం రూ.2000 కరెన్సీ నోట్లను స్వీకరిస్తున్నట్లు అమెజాన్ తన నోట్‌లో పేర్కొంది. అయితే రూ.2000 కరెన్సీ నోట్లు సెప్టెంబర్ 19, 2023 నుంచి తీసుకోలేమని తెలిపింది. థర్డ్ పార్టీ కొరియర్ భాగస్వామి ద్వారా ప్రోడక్ట్‌ను డెలివరీ చేస్తే రూ.2000 నోటు ఆమోదించబడుతుందని అమెజాన్ తెలిపింది.
మీ వద్ద ఇప్పటికీ రూ.2000 నోటు ఉంటే మీరు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ నుంచి మార్చుకోవచ్చు. మే 19, 2023న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్లను చెలామణి నుంచి తొలగించింది. అలాగే ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. అప్పటి నుంచి చాలా మంది బ్యాంకులను సంప్రదించారు. ఆ తర్వాత కూడా అంచనాల ప్రకారం.. బ్యాంకుల్లో నోట్లు జమ కాలేదు. అయితే ఈ సమయం వరకు రూ. 2000 నోటు చట్టబద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత నోటు చట్టబద్ధమైన టెండర్ వర్గం నుంచి తీసివేయబడుతుంది.
పార్లమెంట్‌లో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది
చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం నగదు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మే 19న రిజర్వ్ బ్యాంక్ తమ ఉపసంహరణను ప్రకటించిన తర్వాత జూన్ 30 వరకు భారతీయ బ్యాంకులకు రూ.2.72 లక్షల కోట్ల విలువైన 2,000 నోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 25న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం.. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని, అలాగే కొందరు 2000 రూపాయలను నోట్లను మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి