Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. వీటిపై 70శాతం డిస్కౌంట్స్..

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అతితక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు లభిస్తున్నాయి. వివిధ రకాల ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ సేల్ ఈ నెల 14తో ఎండ్ కానుంది. ఇంకా ఒక్క రోజే ఉంది కాబట్టి మీకు కావాల్సిన దానికి తక్కువ ధరకే సొంతం చేసుకోండి..

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. వీటిపై 70శాతం డిస్కౌంట్స్..
Amazon Prime Day Sale

Updated on: Jul 13, 2025 | 6:51 PM

అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. జూలై 12న ప్రారంభమైన ఈ సేల్ సోమవారం వరకు జరగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అమెజాన్ ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లను వెల్లడించింది. వన్ ప్లస్, సామ్‌సంగ్, ఐక్యూ, యాపిల్ వంటి బ్రాండ్‌ల నుండి ఫోన్‌లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఈ సేల్‌లో వన్ ప్లస్ 13s, వన్ ప్లస్13, వన్ ప్లస్13R, వన్ ప్లస్ నార్డ్ 5, వన్ ప్లస్ నార్డ్ 5CE, శామ్‌సంగ్ గెలాక్సీM36, శామ్‌సంగ్ గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్ , గెలాక్సీ S24 అల్ట్రా, ఐక్యూ 13, ఐక్యూ Z10, ఐక్యూ Z10 లైట్, రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14 ప్రో వంటి ఫోన్లపై అమెజాన్ బిగ్ డిస్కౌంట్స్ అందిస్తుంది. వీటితో అనేక ఫోన్‌ల కొనుగోలుపై వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్ లను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. లెనోవా, డెల్, హెచ్‌పీ, ఏసర్ వంటి బ్రాండ్‌ల నుండి ల్యాప్‌టాప్‌లపై మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో, శామ్‌సంగ్, ఎల్‌జీ, డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్ వంటి బ్రాండ్‌ల నుండి విండో, స్ప్లిట్ ఏసీలపై మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి బ్రాండ్ యొక్క 1 టన్ను, 1.5 టన్ను లేదా 2 టన్ను ఏసీలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు మొదలైన వాటిని గొప్ప డిస్కౌంట్‌లతో మీ సొంతం చేసుకోవచ్చు. ఇవి 70 నుండి 80 శాతం తగ్గింపుకు లభిస్తున్నాయి.

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. ఇది అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం గురించి మాట్లాడుకుంటే, దాని షాపింగ్ ఎడిషన్ ప్లాన్ రూ. 399 నుండి ప్రారంభమవుతుంది. ఈ రూ. 399 ప్లాన్‌లో, వినియోగదారులు 12 నెలల పాటు అంటే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందుతారు. అదే సమయంలో అమెజాన్ ప్రైమ్ లైట్ ఏడాదికి రూ. 799 ఖర్చవుతుంది. స్టాండర్డ్ ప్రైమ్ సభ్యత్వం యొక్క వార్షిక ప్లాన్ రూ. 1,499గా ఉంది. నెలవారీ ప్లాన్ గురించి చెప్పాలంటే, స్టాండర్డ్ ప్లాన్ నెలకు రూ. 299 నుండి ప్రారంభమవుతుంది.