Amazon Case: ముదురుతున్న వివాదం.. ఫ్యూచర్ రిటైల్ పై అమెజాన్ క్రిమినల్ కేసు.. కారణం ఏంటంటే..

|

Mar 03, 2022 | 9:11 AM

Amazon Case: ఫ్యూచర్ రిటైల్ కంపెనీపై క్రిమినల్(Criminal Proceedings) చర్యలు చేపట్టాలని ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ యోచిస్తోంది. ఈ వారం దీనిపై కోర్టును(Delhi Court) ఆశ్రయించాలని భావిస్తోంది.

Amazon Case: ముదురుతున్న వివాదం.. ఫ్యూచర్ రిటైల్ పై అమెజాన్ క్రిమినల్ కేసు.. కారణం ఏంటంటే..
Amazon
Follow us on

Amazon Case: ఫ్యూచర్ రిటైల్ కంపెనీపై క్రిమినల్(Criminal Proceedings) చర్యలు చేపట్టాలని ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ యోచిస్తోంది. ఈ వారం దీనిపై కోర్టును(Delhi Court) ఆశ్రయించాలని భావిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ వారం ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ సంస్థ తనకు ఉన్న వాటిలో దాదాపు 500 రిటైల్ స్టోర్లను.. రిలయన్స్ గ్రూప్(Reliance Group) కు కట్టబెట్టటమే కారణంగా తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా అమెజాన్, ఫ్యూటర్ రిటైల్ మధ్య న్యాయపరమైన యుద్ధం జరుగుతోంది. దీని కారణంగా ఫ్యూటర్ రిటైల్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మధ్య జరగాల్సిన 3.4 బిలియన్ డాలర్ల డీల్ నిలిచిపోయింది. భారత్ లో ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్ కు ఫ్యూచర్ ఆస్తులు వెళ్లకుండా అమెజాన్ 2020 నుంచి అడ్డుకోగలిగింది. దీనికి సంబంధించి అగ్రిమెంట్ లో కొన్ని నిబంధనలను సదరు సంస్థ అతిక్రమించిందని కారణంగా చూపింది.

ఫ్యూచర్ కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద రిటైల్ సంస్థగా నిలిచింది. సింగపూర్ మధ్యవర్తిత్వ సంస్థ, భారత కోర్టులు సైతం అమెజాన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించాయి. ఈ తరుణంలో రిలయన్స్ సంస్థ ఫ్యూచర్ కు చెందిన 500 స్టోర్లను రీ బ్రాండింగ్ చేసి తన సొంత అవుట్ లెట్లుగా మారుస్తోంది. రిలయన్స్ గతంలో ఫ్యూచర్ యొక్క కొన్ని ఫ్లాగ్‌షిప్ సూపర్ మార్కెట్ల లీజులను దాని పేరుకు బదిలీ చేసుకుంది. అయితే ఫ్యూచర్ వాటిని నిర్వహించటానికి అనుమతించింది. ఫ్యూచర్‌కి అద్దె చెల్లింపులు చేయడంలో విఫలమైన తర్వాత రిలయన్స్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఫ్యూచర్‌పై దిల్లీ కోర్టులో క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించాలని అమెజాన్ యోచిస్తోంది. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరుతుందని.. ఈ విషయంపై అవగాహన ఉన్న అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వారంలోనే అమెజాన్ వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. FD వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే..

Rakesh Jhunjhunwala: 6 నెలల్లో 40 శాతం పెరిగిన షేరు.. కొత్తగా 11 లక్షల షేర్లు కొన్న రాకేశ్ జున్‌జున్‌వాలా..