Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఎదురు దెబ్బ.. కంపెనీకి గుడ్‌బై చెప్పనున్న సీఈవో డేవ్‌క్లార్క్‌..

|

Jun 05, 2022 | 8:43 AM

ఈ కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో కీలక పరిణామం జరిగింది. వరల్డ్‌ వైడ్‌ కన్సుమర్‌ బిజినెస్‌ సీఈవో డేవ్‌క్లార్క్‌ అమెజాన్‌ నుంచి వైదొలగనున్నారు. అతను ఈ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. 2022 జులై 1తో అమెజాన్‌కు డేవ్‌క్లార్క్‌ గుడ్‌బై చెప్పనున్నారు. కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసిన డేవ్‌క్లార్క్‌ 1999లో అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ కామర్స్‌ రంగం ప్రారంభ దశలోనే ఉంది. అప్పటి నుంచి జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ […]

Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఎదురు దెబ్బ.. కంపెనీకి గుడ్‌బై చెప్పనున్న సీఈవో డేవ్‌క్లార్క్‌..
Amazon Retail Ceo
Follow us on

ఈ కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో కీలక పరిణామం జరిగింది. వరల్డ్‌ వైడ్‌ కన్సుమర్‌ బిజినెస్‌ సీఈవో డేవ్‌క్లార్క్‌ అమెజాన్‌ నుంచి వైదొలగనున్నారు. అతను ఈ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. 2022 జులై 1తో అమెజాన్‌కు డేవ్‌క్లార్క్‌ గుడ్‌బై చెప్పనున్నారు. కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసిన డేవ్‌క్లార్క్‌ 1999లో అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ కామర్స్‌ రంగం ప్రారంభ దశలోనే ఉంది. అప్పటి నుంచి జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ అంచెలంచెలుగా అమెజాన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ కంపెనీగా మార్చారు. డేవ్‌క్లార్క్‌ తమ సంస్థను వీడి వెళ్తున్న విషయంపై అమెజాన్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా అమెరికా స్టాక్‌ మార్కెట్‌ అధికారులకు సమాచారం ఇచ్చింది. కంపెనీతో అభిప్రాయ బేధాలు ఏమీ లేవని ఇతర చోట పని చేయాలనే ఉద్దేశంతోనే క్లా‍ర్క్‌ తమ సంస్థను వీడినట్టు అమెజాన్‌ పేర్కొంది.

అటు దిగ్గజ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో కూడా ఓ కీలక అధికారిణి తప్పుకోనున్నారు. ఫేస్‌బుక్‌ వ్యాపారాన్ని అంకుర స్థాయి నుంచి డిజిటల్‌ వ్యాపార ప్రకటనల సామ్రాజ్యంగా విస్తరించడంలో ఎంతో కృషి చేసిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) షెరిల్‌ శాండ్‌బర్గ్‌ కంపెనీకి రాజీనామా చేయనున్నారు. గూగుల్‌ నుంచి వచ్చిన షెరిల్‌, లిస్టింగ్‌కు నాలుగేళ్ల ముందు అంటే 2008లో ఫేస్‌బుక్‌లో జాయిన్‌ అయ్యారు. ‘ఉద్యోగంలో చేరిన సమయంలో అయిదేళ్ల పాటు ఉంటానని భావించా కానీ 14 ఏళ్లు గడిచాయని. నా జీవితంలో తదుపరి అధ్యాయం రాయడానికి ఇదే సమయమని భావిస్తున్నా’నని తన ఫేస్‌బుక్‌ పేజీలో వివరించారు. కంపెనీలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తర్వాతి స్థానం ఈమెదే అవ్వడం గమనార్హం. సాంకేతిక పరిశ్రమలో అత్యంత ప్రఖ్యాతిఖాంచిన మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచిన షెరిల్‌.. అటు మహిళలకు కానీ, ఇటు ఫేస్‌బుక్‌ ఉత్పత్తుల వల్ల ఇబ్బందులు పడ్డవారి విషయంలో కానీ సరిగ్గా స్పందించలేదని విమర్శల పాలయ్యారు.