Halwa Ceremony: బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు?
ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కారణం చూస్తే ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం, ముద్రణ పూర్తి అయి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ వారంతా ఆర్థిక శాఖ..
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల వారితో సమావేశమై.. బడ్జెట్ కూర్పుపై చేసిన కసరత్తు ముగియనుంది. ఇక బడ్జెట్ కాపీలు ముద్రణకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్మలా సీతారామన్ ఘనంగా నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్ కు సన్నాహకంగా చేసే సంప్రదాయ హల్వా వేడుకను ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ పంచారు.
హల్వా వేడుకలు:
ఇదిలా ఉంటే ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కారణం చూస్తే ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం, ముద్రణ పూర్తి అయి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ వారంతా ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్ లోనే ఉంటారు. ఆ సమయంలో వారు ఇంటికి కూడా వెళ్లారు. వారు బయటి ప్రపంచంతో సంప్రదించేందుకు ఫోన్ కూడా అందుబాటులో ఉండదు.
అయితే ముద్రణ పనిలో ఆర్థిక శాఖ సిబ్బంది నిమగ్నం కావడానికి ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా చేయడం ఆచారంగా వస్తోంది. హల్వాను భారతీయ ప్రత్యేక వంటకంగా పరిగణిస్తారు. అందుకే హల్వా తయారీతో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభిస్తారు.
కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశఫెట్టేది మధ్యంతర బడ్జెట్. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను జూలైలో సమర్పించనున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి