SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు అలెర్ట్.. నయా రూల్స్‌తో చార్జీల బాదుడు షురూ

ముఖ్యంగా డెబిట్ కార్డులు అకౌంట్‌లోని సొమ్ము విత్ డ్రా చేసుకోవడానికి తప్పనిసరయ్యాయి. తాజాగా భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన డెబిట్ కార్డ్, వార్షిక నిర్వహణ, లావాదేవీ పరిమితి, లావాదేవీల ఛార్జీలు, ఎస్ఎంష్ హెచ్చరిక సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ప్రకటన ప్రకారం సవరించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి వర్తిస్తాయి. 

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు అలెర్ట్.. నయా రూల్స్‌తో చార్జీల బాదుడు షురూ
Debit Card
Follow us

|

Updated on: Mar 28, 2024 | 5:45 PM

మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా డెబిట్ కార్డులు అకౌంట్‌లోని సొమ్ము విత్ డ్రా చేసుకోవడానికి తప్పనిసరయ్యాయి. తాజాగా భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన డెబిట్ కార్డ్, వార్షిక నిర్వహణ, లావాదేవీ పరిమితి, లావాదేవీల ఛార్జీలు, ఎస్ఎంష్ హెచ్చరిక సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ప్రకటన ప్రకారం సవరించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి వర్తిస్తాయి.  ఎష్‌బీఐ సవరించిన చార్జీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) ఆధారంగా ఏటీఎం  లావాదేవీలను వర్గీకరించింది. ఎస్‌బీఐ ఆరు మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలలో సగటున రూ. 1 లక్ష వరకు నెలవారీ బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు 3 ఉచిత లావాదేవీలను, దేశంలోని ఇతర ప్రాంతాలలో 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. అదనంగా సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ.25,000 కంటే ఎక్కువ ఉన్నవారు ఎస్‌బీఐ ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలను ఆస్వాదించవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత లావాదేవీలను పొందేందుకు కస్టమర్లు కనీసం రూ. 1 లక్ష వరకు సగటు నెలవారీ బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. ఉచిత లావాదేవీల పరిమితిని దాటిన తర్వాత ఎస్‌బీఐ ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8 వసూలు చేస్తుంది.

అదనపు ఛార్జీలు ఇలా

లావాదేవీ ఛార్జీలు కాకుండా తగినంత బ్యాలెన్స్ లేనందున తిరస్కరించిన లావాదేవీకి ఎస్‌బీఐ రూ. 20 రుసుమును విధిస్తుంది. అదనంగా డెబిట్ కార్డ్ హెూల్డర్లు రూ. 25,000 సగటు బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో విఫలమైతే త్రైమాసిక రుసుము రూ. 12 (జీఎస్టీతో సహా) విధిస్తారు.

ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్

త్రైమాసికంలో సగటు త్రైమాసిక బ్యాలెన్స్ రూ. 25000 అంతకంటే తక్కువ ఉన్న డెబిట్ కార్డ్ హెల్డర్ల నుంచి త్రైమాసికానికి 12 చొప్పున ఎస్ఎంఎస్ హెచ్చరిక వసూలు చేస్తుంది.