
హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. అందుకే ఈ రోజున చేసే పుణ్యకార్యాలు, దానం, జపం, యజ్ఞం, పితృ తర్పణం శాశ్వత ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. పంచాంగాల ప్రకారం ఈ పర్వదినానికి అధిపతి విష్ణుమూర్తి. అలాగే పురాణాల ప్రకారం త్రేతా యుగం కూడా ఈ రోజునే ప్రారంభమైందని చెబుతారు. చాలాసార్లు ఇదే రోజు పరశురామ జయంతి కూడా వస్తుంది.
ఈ సంవత్సరం (2026) అక్షయ తృతీయను ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. ఆధునిక కాలంలో ఈ రోజున బంగారం, వెండి కొనడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, శాస్త్రాల్లో బంగారం కొనాలనే నియమం ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు. ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కొన్ని శుభప్రదమైన వస్తువులు కొనడం కూడా మంచిదని నమ్ముతారు.
బంగారం కొనుగోలుకు సాధారణంగా ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం వరకు శుభ సమయం ఉంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:15 వరకు మంచి ముహూర్తంగా పరిగణిస్తారు. మొత్తంగా అక్షయ తృతీయ అనేది కేవలం కొనుగోళ్లకే పరిమితమైన రోజు కాదు. ఆధ్యాత్మికత, దానధర్మాలు, సత్కార్యాలు చేయడానికి ఇది అత్యంత శుభదినంగా భావించబడుతుంది. సరైన భావనతో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా ఈ రోజున అక్షయం అవుతుందని విశ్వాసం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి