Airtel Payments Bank: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. వడ్డీ రేటు పెంచూతు కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ ఖాతా కలిగిన వారికి అధిక వడ్డీ అందిస్తోంది. దీంతో ఎయిర్‌టెల్ ఖాతా కలిగిన వారికి బెనిఫిట్ చేకూరనుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారికి ఇకపై 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. లక్షకుపైగా డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. కాగా ఎయిర్‌టెల్ కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలో రూ.2 లక్షల వరకు డబ్బులు కలిగి ఉండవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవలనే లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న తొలి పేమెంట్స్ బ్యాంక్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు 5.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అదే మీరు ఎయిర్‌టెల్ బ్యాంక్ ఖాతాలో రూ.లక్ష లోపు బ్యాలెన్స్ కలిగి ఉంటే 2.5 శాతం వడ్డీనే లభిస్తుంది.
కాగా, ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా కస్టమర్లు బ్యాంక్ సర్వీసులు పొందే అవకాశం ఉంది. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ భావిస్తే.. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఖాతా ఓపెన్ చేయొచ్చు. వీడియో కాల్ ద్వారా నిమిషంలోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.