Airtel Offer: ఎయిర్‎టెల్ బంపర్ ఆఫర్.. రూ.6000 క్యాష్‎బ్యాక్.. దీని కోసం మీరు ఏం చేయాలంటే..

|

Oct 08, 2021 | 5:10 PM

ఎయిర్‎టెల్ తన వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్‌టెల్ శుక్రవారం రూ.12000 వరకు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 6000 కొత్త క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది...

Airtel Offer: ఎయిర్‎టెల్ బంపర్ ఆఫర్.. రూ.6000 క్యాష్‎బ్యాక్.. దీని కోసం మీరు ఏం చేయాలంటే..
Follow us on

ఎయిర్‎టెల్ తన వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్‌టెల్ శుక్రవారం రూ.12000 వరకు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 6000 కొత్త క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారులను నిలుపుకోవటానికి ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ నుంచి సుమారు రూ .12,000 వరకు ధర కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఎయిర్‌టెల్ రూ. 6,000 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. 150కి పైగా స్మార్ట్‌ఫోన్లను జాబితాలో చేర్చింది. ఈ ఫోన్లు కొంటే క్యాష్‎బ్యాక్ వస్తుంది.

ఎయిర్‌టెల్ వినియోగదారుడు 36 నెలల పాటు రూ .249 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడే క్యాష్‎బ్యాక్‏‎కు వినియోగదారులు అర్హులు. కస్టమర్ రెండు దశల్లో క్యాష్‌బ్యాక్ అందుకుంటారు. 18 నెలలు లేదా 1.5 సంవత్సరాల తర్వాత మొదటి విడత రూ. 2000, మిగిలిన రూ.4000 36 నెలలు లేదా మూడు సంవత్సరాల అందుకుంటారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 249 అపై ప్రీపెయిడ్ రీఛార్జ్‌లతో అపరిమిత కాలింగ్,​​డేటా ప్రయోజనాలతో పాటు ప్రత్యేకమైన ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను పొందుతారు. వీటిలో ఉచిత వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క 30 రోజుల ట్రయల్ ఉన్నాయి. “స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ప్రాథమిక అవసరం, ప్రత్యేకించి కరోనా మహమ్మారి అనంతర కాలంలో వినియోగదారులు డిజిటల్‌గా అనేక రకాల సేవలను యాక్సెస్ చేయాలని చూస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్లు మంచి ఆన్‌లైన్ అనుభవం కోసం నాణ్యమైన స్మార్ట్‌ఫోన్ కోసం ఆకాంక్షిస్తుండగా, వారికి నచ్చిన పరికరాన్ని సులభంగా కలిగి ఉండాలనేది మా ఆశయం” అని మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ అన్నారు.

 

Read Also.. Air India privatisation: టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా.. ఎంతకు దక్కించుకున్నారో తెలుసా..?