Air India: టాటా గ్రూప్‌కు ఎయిర్‌ ఇండియా అప్పగింత మరింత ఆలస్యం..!

|

Dec 27, 2021 | 7:50 PM

Air India: టాటా సన్స్ యాజమాన్య అనుబంధ సంస్థ.. టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ అదేవిధంగా..

Air India: టాటా గ్రూప్‌కు ఎయిర్‌ ఇండియా అప్పగింత మరింత ఆలస్యం..!
Follow us on

Air India: టాటా సన్స్ యాజమాన్య అనుబంధ సంస్థ.. టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ అదేవిధంగా ఎయిర్ ఇండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

అయితే ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూప్‌ టేకోవర్‌ చేయడం జనవరి వరకు అంటే ఒక నెల ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియలు పూర్తి కావడానికి ఊహించినదానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని సోమవారం ఒక అధికారి తెలిపారు. ప్రతిపాదిత కలయికలో టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఎయిర్ ఇండియా), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ (AIXL) 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఎయిర్ ఇండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISATS) 50% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉన్నాయి.

ఆ సమయంలో డిసెంబర్‌ చివరి నాటికి టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించే లావాదేవీలను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టేల్స్ బిడ్‌ను గెలుచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 8న ప్రకటించింది. జాతీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను 18,000 కోట్లకు విక్రయించేందుకు టాటా సన్స్‌తో అక్టోబర్‌ 25న ప్రభుత్వం వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవి కూడా చదవండి:

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!

Chicken Biryani: ఈ ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీ.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..!