Air India: టాటా గొప్ప మనస్సు.. ఎయిర్ ఇండియా ఉద్యోగుల పీఎఫ్ నింబధన మార్పు..

టాటాలు మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఎయిర్ ఇండియా చేతిలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఉద్యోగుల కోసం నిబంధనలు మార్పు చేశారు..

Air India: టాటా గొప్ప మనస్సు.. ఎయిర్ ఇండియా ఉద్యోగుల పీఎఫ్ నింబధన మార్పు..
Air India

Updated on: Jan 29, 2022 | 7:58 PM

టాటా మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఎయిర్ ఇండియా చేతిలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఉద్యోగుల కోసం నిబంధనలు మార్పు చేశారు. బ్రిటీష్‌ కాలంలో అమల్లోకి వచ్చిన పీఎఫ్‌ యాక్ట్‌ 1925 పరిధిలో ఉండే ఉద్యోగులకు పెన్షన్‌ స్కీం, ఇన్సురెన్సు స్కీమ్‌లు తప్పనిసరిగా అమలు కావు. ఇవి సౌకర్యాలు కావాలంటే ఉద్యోగులు స్వచ్చంధంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలో ఉన్న లోపాలను 1952లో మొదటిసారి సవరించారు. 1976, 1995లో పలు సార్లు సవరణలు చేశారు. ఎయిరిండియా మాత్రం ఎప్పటి నుంచో 1925 పీఫ్‌ యాక్టు పరిధిలోనే కొనసాగుతోంది.

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత టాటా తమ ఉద్యోగుల కోసం PF నియమాలు మార్చింది. ఈ మేరకు సంస్థను టేకోవర్‌ చేయడానికి ముందే జనవరి 13న ఎయిరిండియా చేత దరఖాస్తు చేయించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాల కోసం ఎయిర్ ఇండియాను చేర్చినట్లు శనివారం తెలిపింది . ఇప్పటివరకు 7,453 మంది ఉద్యోగులకు కంట్రిబ్యూషన్‌లు అందాయని ఈపీఎఫ్‌వో తెలిపింది.

డిసెంబరు నెలలో ఎయిర్ ఇండియా EPFOతో సహకరించిన సుమారు 7,453 మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయని EPFO ​​తెలిపింది. ఇది కాకుండా, SBI నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎయిర్ ఇండియా నిర్వహణ కోసం టాటా గ్రూప్‌కు రుణాలను అందజేస్తుంది. కన్సార్టియంలో SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. కన్సార్టియం టాటా గ్రూప్‌కు టర్మ్ లోన్‌లతో పాటు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను అందిస్తుంది. Tata Group యొక్క అనుబంధ సంస్థ Talace Private Limited 8 అక్టోబర్ 2021న ఎయిర్ ఇండియాను 18000 కోట్లకు కొనుగోలు చేసింది.

Read Also.. Real Estate: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..