Broadband Charges: మొబైల్ రీఛార్జీల పెరుగుదల తరువాత ఇప్పుడు ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ మోత మోగనుంది!

మొబైల్ రీఛార్జ్ తర్వాత ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ వంతు వచ్చింది. మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిన తర్వాత, మన ఇంటికి వచ్చే కేబుల్ ఇంటర్నెట్ ధరలు పెరగవచ్చు.

Broadband Charges: మొబైల్ రీఛార్జీల పెరుగుదల తరువాత ఇప్పుడు ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ మోత మోగనుంది!
Internet Broadband Rates
Follow us

|

Updated on: Dec 12, 2021 | 7:25 PM

Broadband Charges: మొబైల్ రీఛార్జ్ తర్వాత ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ వంతు వచ్చింది. మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిన తర్వాత, మన ఇంటికి వచ్చే కేబుల్ ఇంటర్నెట్ ధరలు పెరగవచ్చు. దీని కోసం, మొబైల్ కంపెనీలు వాదించినట్లు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు ద్రవ్యోల్బణం సాకును చూపిస్తున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా ఇంటర్నెట్ ప్లాన్‌ల రేట్లను పెంచేందుకు సన్నాహాలు చేయడంతో చౌక టెలికాం టారిఫ్‌ల రోజులు ముగిసినట్టే అని భావిస్తున్నారు.

బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు తమ సేవలను అందించే రేటుతో మనుగడ సాగించడం కష్టమని, నిరంతరం నష్టాలను చవిచూస్తున్నాయని చెప్పారు. దేశంలోని పెద్ద టెలికాం కంపెనీలన్నీ ఖర్చు, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకుంటూ మొబైల్ టారిఫ్‌ను 20 శాతం పెంచాయి. ఈ కంపెనీలలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా ఉన్నాయి. టెలికాం వ్యాపారం ముందుకు సాగాలంటే టారిఫ్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. మొదట ఎయిర్‌టెల్, తర్వాత వోడా ఐడియా, చివరకు జియో మొబైల్ రీఛార్జ్ రేట్లను పెంచాయి. దీంతో ఈ మొబైల్ ప్రణాళికలు దాదాపు 20% వరకు ఖరీదైనవిగా మారాయి.

15-20 శాతం పెంచేందుకు..

అదే తరహాలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ టారిఫ్‌ను కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోల్‌కతాలోని మేఘ్‌బేలా బ్రాడ్‌బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు తపబ్రత ముఖర్జీ పిటిఐతో మాట్లాడుతూ, “మొబైల్‌లకు ARPU (సగటు ఆదాయంపై కస్టమర్) ఉన్నట్లే, బ్రాడ్‌బ్యాండ్‌కు కూడా సిస్టమ్ అవసరం. బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో వినియోగదారులకు మంచి సౌకర్యాలు కల్పించడంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. బ్రాడ్‌బ్యాంక్ ప్రస్తుత సర్వీస్ సజావుగా కొనసాగాలంటే రేటును 15-20 శాతం పెంచాలి.” అని చెప్పారు.

OTT ఒత్తిడి పెరిగింది

మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఓవర్ ది టాప్ లేదా ఒటీపీ(OTP) స్ట్రీమింగ్ సర్వీస్ ఎలాంటి ఛార్జీ లేకుండా అందిస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లపై ఒత్తిడి పెరిగింది. ఎయిర్‌టెల్, జియో వంటి జాతీయ టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను సవరించాల్సి ఉంటుందని, లేకుంటే చిన్న కంపెనీలు తమ కస్టమర్లు పారిపోకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న టారిఫ్ స్ట్రక్చర్‌తో సమానంగా ఉండాలని ముఖర్జీ అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్రాడ్‌బ్యాండ్‌కు చెందిన బడా కంపెనీలు ఇంటర్నెట్ రేటును సవరించే మూడ్‌లో లేనట్లు కనిపిస్తోంది.

ఎయిర్‌టెల్..జియో వంటి బ్రాడ్‌బ్యాండ్ మేజర్‌లు ఇంటర్నెట్‌లో ఎక్కువ ఖర్చు చేసే అధిక విలువ కలిగిన కస్టమర్‌లపై దృష్టి సారించాయి. ఈ డబ్బు ఉన్న కంపెనీలు కస్టమర్ల నుంచి మంచి డబ్బు సంపాదిస్తాయి. ఇది ఏఆర్పీయూ(ARPU)ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మరోవైపు, చిన్న లేదా స్థానిక బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలకు తక్కువ డబ్బు ఖర్చు చేసే కస్టమర్‌లు ఉన్నారు. అయితే, ఈ కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ.

ఈ చిన్న కంపెనీల మధ్య పెద్దగా పోటీ లేదు. కానీ పెద్ద కంపెనీలు చిన్న నగరాల్లో తమ పనిని పెంచుకుంటే, పోటీ పెరుగుతుంది. కస్టమర్లు తక్కువ ఖర్చుతో ఉన్న చిన్న కంపెనీలపై మరింత ఒత్తిడి ఉంటుంది. ఈ ట్రెండ్ మొదలైంది కాబట్టి స్థానిక బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా తమ ఇంటర్నెట్ టారిఫ్‌ను పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి: Medicine with Milk: టాబ్లెట్స్ పాలతో లేదా జ్యూస్ లతో ఎందుకు తీసుకోకూడదో తెలుసా.. కొన్ని టాబ్లెట్ రేపర్స్ పై ఎర్రని గీత ఎందుకుంటుంది? తెలుసుకోండి!

India help to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు చేరిన భారత్ మెడిసిన్స్.. తాలిబన్ల ధన్యవాదాలు.. ఈ సహాయంపై వారెమన్నారంటే..