ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా అదానీ గ్రూప్‌కు దక్కింది. గంగవరం పోర్టులోని మిగిలిన 58.1 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈజెడ్) సొంతం చేసుకోవడానికి సోమవారం ఎన్‌ఎల్‌సీటీ హైదరాబాద్ నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో గంగవరం పోర్ట్ మొత్తాన్ని అదానీ గ్రూప్ సొంతం చేసుకున్నట్లైంది. ఇదిలా ఉంటే.. గంగవరం పోర్ట్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కాంపొజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌కు సెప్టెంబరు 21న ఎన్‌సీఎల్‌టీ, అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా దీనికి హైదరాబాద్ బెంచ్ కూడా అంగీకారం తెలిపింది. ఈ రెండు ఆర్డర్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ వద్ద దాఖలు చేసిన వెంటనే స్కీమ్ అమలులోకి వస్తుంది. ఇక గంగవరం పోర్టును సుమారు రూ. 6,200 కోట్లకు ఏపీఎస్‌ఈజెడ్ సొంతం చేసుకుంది. ఒక్కో షేర్‌ను రూ. 120కి మొత్తం 51.7 కోట్ల షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే గంగవరం పోర్టుకు చెందిన 31.5 శాతం వాటాను వార్‌బర్గ్ పింకస్ నుంచి కొనుగోలు చేయగా.. ఏపీ ప్రభుత్వానికి చెందిన 10.4 శాతం వాటాను గతేడాది కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
APSEZ of @AdaniOnline, has received approvals from NCLT Ahmedabad & NCLT Hyd for acquiring the remaining 58.1% stake in Vizag based Gangavaram Port Limited (GPL) through the composite scheme of arrangement. With this stake purchase, GPL will become a 100% subsidiary of APSEZ.1/9 pic.twitter.com/gUvsghj76v
— SNV Sudhir (@sudhirjourno) October 10, 2022
గంగవరం పోర్ట్ ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తర దిశ విశాఖపట్నం పోర్ట్ తర్వాత ఉంటుంది. ఏపీలో ఇది మూడో అతిపెద్ద పోర్ట్. దీని కెపాసిటీ 64 ఎమ్‌ఎమ్‌టీ కావడం విశేషం. ప్రస్తుతం ఈ పోర్ట్‌లో 9 బెర్త్‌లను ఆపరేట్ చేస్తున్నారు. ఈ పోర్ట్ మొత్తం 1800 ఎకరాల్లో ఉంది. ఈ పోర్ట్ నుంచి 8 రాష్ట్రాలకు కార్గో సేవలు అందుతున్నాయి. 2022 ఏడాదికి గాను ఈ పోర్ట్ ద్వారా రూ. 1206 కోట్ల విలువైన సుమారు 30 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకుల సరఫరా జరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..