Adani Media: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ గత కొంత కాలంగా కొత్త కంపెనీలను కొంటూ పోతున్నారు. ఈ నెల ప్రారంభంలో బాస్మతీ బియ్యం వ్యాపారంలోని కోహినూర్ కంపెనీలో వాటాలు కొన్న అదానీ.. నిన్న రెండు దిగ్గజ సిమెంట్ కంపెనీలను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మీడియా రంగంలోకి ప్రవేశించేందుకు అనువుగా మరో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఇప్పటికే అదానీ గ్రూప్.. పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, రోడ్లు, రిటైల్, పవర్ నుంచి లాజిస్టిక్స్ వంటి అనేక రంగాల్లోకి తన వ్యాపారాలను వేగంగా విస్తరించుకుంటున్నారు. ఈ తరుణంలో క్వింటిల్లియాన్ బిజినెస్ మీడియా లిమిటెడ్ లో 49 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా QML, QBML and Quint Digital Media Ltd లతో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్‌తో వాటాల విక్రయానికి ఒక ఒప్పందం జరిగినట్లు క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్ అధికారికంగా ధృవీకరించింది. రాఘవ్ బహల్ స్థాపింంచిన డిజిటల్ ప్లాట్‌పామ్ బ్లూంబర్గ్ క్వింట్‌ను క్యూబీఎంఎల్ నిర్వహిస్తోంది. పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, బ్రాడ్‌కాస్టింగ్ వంటి అనేక మార్గాల్లో ప్రస్తుతం ఈ సంస్థ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. మీడియా రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ అనే పేరుతో సంస్థను స్థాపించింది. ఈ మీడియా గ్రూప్ ను ముందుకు తీసుకెళ్లే విషయంలో సీనియర్ జర్నలిస్టు సంజయ్ పుగాలియా కీలకంగా వ్యవహరించనున్నారు. అదానీ కంపెనీ కొనుగోలు చేయటంతో క్వింట్ డిజిటల్ మీడియా విలువ 9 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది.
Adani Group acquires a whopping 49% stake in Quint Media. pic.twitter.com/EzBlRcOp6O
— Ashish (@aashishNRP) May 15, 2022