Ambani: అంబానీ ఆస్తులపై కన్నేసిన అదానీ.. దానిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నం..

|

Mar 17, 2022 | 7:32 AM

Reliance Capital: రుణభారంతో కుదేలైన అనిల్‌ అంబానీ(Mukesh Ambani) గ్రూప్‌ కంపెనీని సొంతం చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ముందువరుసలో ఉన్నాయి.

Ambani: అంబానీ ఆస్తులపై కన్నేసిన అదానీ.. దానిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నం..
Anil Ambani Barred
Follow us on

Ambani: రుణభారంతో కుదేలైన అనిల్‌ అంబానీ(Mukesh Ambani) గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ క్యాపిటల్‌ను(Reliance Capital) సొంతం చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు అదానీ ఫిన్‌సర్వ్, కేకేఆర్, పిరమల్‌ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్‌ తో పాటు మరో 14 దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్‌ క్యాపిటల్‌ కొనుగోలుకు వీలుగా బిడ్లు(Bids)  దాఖలు చేసేందుకు ఆర్‌బీఐ నియమిత పాలనాధికారి ఈ నెల 25వరకు గడువును పెంచారు. చెల్లింపుల్లో వైఫల్యం, కార్పొరేట్‌ పాలనా సంబంధ సమస్యల కారణాలతో గతేడాది నవంబర్‌ 29న ఆర్‌బీఐ రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ బోర్డును రద్దు చేసిన విషయం తెలిసినదే. 2021 సెప్టెంబర్‌లో కంపెనీ నిర్వహించిన ఏజీఎంలో కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ. 40 వేల కోట్లుగా వాటాదారులకు తెలియజేసింది. ఇటీవల ఆర్‌బీఐ దివాలా చట్ట చర్యల(ఐబీసీ)కు ఉపక్రమించిన మూడో పెద్ద నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)గా రిలయన్స్‌ క్యాప్‌ నిలుస్తోంది.

అనిల్ అంబానీకి చెందిన ఈ కంపెనీని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే.. ఆర్ప్‌ వుడ్, వర్దే పార్టనర్స్, మల్టిపుల్స్‌ ఫండ్, నిప్పన్‌ లైఫ్, జేసీ ఫ్లవర్స్, బ్రూక్‌ఫీల్డ్, ఓక్‌ట్రీ, అపోలో గ్లోబల్, బ్లాక్‌స్టోన్, హీరో ఫిన్‌కార్స్‌ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో చాలవరకూ కంపెనీ పూర్తి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఇందులో భాగంగా..కంపెనీకున్న 8 అనుబంధ సంస్థల కోసం లేదా మొత్తం రిలయన్స్‌ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు ఈవోఐలు దాఖలు చేయవచ్చు. అనుబంధ సంస్థల జాబితాలలో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, రిలయన్స్‌ సెక్యూరిటీస్, రిలయన్స్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ తో పాటు వివిధ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Multibagger Returns: లక్షను.. రెండున్నర నెలల్లో రూ. 8 లక్షలు చేసిన స్టాక్.. మార్కెట్ పడిపోతున్నా పైపైకి..

Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో కుంభకోణం.. ఎన్నివేల కోట్లంటే..