Rakesh Jhunjhunwala: బిగ్ బుల్ పెట్టుబడి పెట్టిన టాటా షేర్లు.. ఆ 4 కంపెనీల్లో ఎంత లాభం వచ్చిందంటే..

|

Mar 13, 2022 | 11:23 AM

Rakesh Jhunjhunwala: దేశీయ ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్ జున్ వాలా సుమారు మూడు డజన్ల కంపెనీ షేర్లలో తన పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. వాటన్నింటిలో టాటా గ్రూప్(Tata Group) కు చెందిన కొన్ని స్టాక్స్ ఎంత లాభాలను ఇచ్చాయంటే..

Rakesh Jhunjhunwala: బిగ్ బుల్ పెట్టుబడి పెట్టిన టాటా షేర్లు.. ఆ 4 కంపెనీల్లో ఎంత లాభం వచ్చిందంటే..
Rakesh Jhunjhunwala
Follow us on

Rakesh Jhunjhunwala: దేశీయ ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్ జున్ వాలా సుమారు మూడు డజన్ల కంపెనీ షేర్లలో తన పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. వాటన్నింటిలో టాటా గ్రూప్(Tata Group) కు చెందిన కొన్ని స్టాక్స్ మాత్రం ఆయన పోర్ట్ ఫోలియోలో(portfolio) చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన టాటాలకు చెందిన టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్, టైటాన్ తో పాటు ఇండియా హోటల్స్ షేర్లలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. రాకేశ్ జున్ జున్ వాలా, ఆయన భార్య రేఖా జున్ జున్ వాలా టైటాన్ కంపెనీలో 5.09 శాతం వాటాను కలిగిఉన్నారు. అంటే సుమారు 4.5 లక్షలకు పైగా కంపెనీలో షేర్లను వీరిద్దరూ కలిగి ఉన్నారు. కేవలం ఒక్క నెల సమయంలో ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 4 శాతం రిటర్న్ అందించగా.. ఇదే సమయంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు మాత్రం సున్నా రిటర్న్ ఇచ్చాయి.

గత సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో టాటా మోటార్స్ కంపెనీలో 3.92 కోట్ల షేర్లను బిగ్ బుల్ కలిగి ఉన్నారు. అంటే కంపెనీ మెుత్తం ఇష్యూ చేసిన షేర్లలో 1.18 శాతం వాటాను ఆయన కలిగి ఉన్నారు. అదే విధంగా టాటా కమ్యూనికేషన్స్ కంపెనీలో 1.08 శాతం వాటాటో 30.75 లక్షల షేర్లను రాకేశ్ కలిగి ఉన్నారు. గడచిన ఒక్క నెల సమయంలో ఈ షేర్ తన విలువలో 5 శాతం వరకు కోల్పోయింది. అదే 2022 సంవత్సరం ప్రారంభం నుంచి తన విలువలో 20 శాతాన్ని కోల్పోయింది.

టాటాలకు సంబంధించిన హోటల్ వ్యాపారంలోనూ రాకేశ్ తన వాటాలను కలిగి ఉన్నారు. ఇండియో హోటల్స్ కంపెనీ గడటిన నెల కాలంలో 4.30 శాతం రిటర్న్ అందించింది. 2022 సంవత్సరం ప్రారంభం నుంచి.. ఈ కంపెనీ షేరు ఏకంగా 10.50 శాతం పెగురుదలను నమోదు చేసింది.

ఇవీ చదవండి..

Spend Wise: అవసరానికి.. లగ్జరీకి తేడా తెల్సుకుని ఖర్చు చేయండి..

Russia Ukraine War: యుద్ధంలో తెరపైకి జీవరసాయన ఆయుధాలు.. అసలు అవి ఎంత ప్రమాదకరమో తెలుసా