Business: క్విక్‌ కామర్స్‌ రంగంలోకి దిగ్గజ సంస్థ.. ‘న్యూఫ్లాష్‌’ పేరుతో..

ప్రస్తుతం దేశంలో క్విక్ కామర్స్ రంగానికి ఆదరణ భారీగా పెరుగుతోంది. ఆర్డర్ చేసిన నిమిషాల్లో వస్తువులు డెలివరీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రంగంలోకి ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు..

Business: క్విక్‌ కామర్స్‌ రంగంలోకి దిగ్గజ సంస్థ.. 'న్యూఫ్లాష్‌' పేరుతో..
Quick Commerce
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 28, 2024 | 2:30 PM

ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్‌ చేసుకోవడం అంటే అదొక వింతగా భావించే వారు. కానీ ప్రస్తుతం సర్వం ఆన్‌లైన్‌ మయం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. అయితే ఓ అడుగు ముందుకేసి క్విక్‌ కామర్స్‌ ఊపందుకుంటోంది. వస్తువును ఆర్డర్‌ చేసిన క్షణాల్లోనే డెలివరీ చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. వంట సామాను మొదలు ఏకంగా స్మార్ట్‌ఫోన్స్‌ వరకు క్విక్‌ కామర్స్‌లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, జెప్టో వంటి సంస్థలు సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ క్విక్‌ కామర్స్‌ రంగంలో ఏకంగా 85 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ సైతం ‘ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌’ పేరుతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసింది. ఇక రిలయన్స్‌ సైతం జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ముంబయిలో ఈ సేవలను ప్రారంభించింది.

అయితే తాజాగా ఈ రంగంలోకి ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ కూడా వచ్చి చేరుతున్నట్లు తెలుస్తోంది. న్యూఫ్లాష్‌ పేరుతో ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు పోటీనిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌ ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఏక కాలంలో ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది టాటా గ్రూప్‌ ఆధ్వరంలో ఇప్పటికే బిగ్‌బాస్కెట్‌, వన్‌ఎమ్‌జీ వంటి ఈ కామర్స్‌ సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా క్విక్‌ కామర్స్‌ రంగంలో అడుగు పెట్టేందుకు టాటా ప్లాన్‌ చేస్తోంది. టాటా గ్రూప్‌లోని టాటా గ్రూప్‌ బిగ్‌బాస్కెట్‌ ద్వారా ఈ-కామర్స్‌, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్‌, టాటా క్లిక్‌ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. దీంతో వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ క్విక్‌ కామర్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..