ABG Shipyard: దేశంలో ఇప్పటిదాకా జరిగిన స్కామ్(Bank fraud) లలో ఏబీజీ ఫిప్ యార్డ్ కంపెనీ కొత్త రికార్డును సృష్టించింది. గతంలోని విజయ్ మాల్యా, నిరవ్ మోదీలు.. బ్యాంకింగ్ ఫ్రాడ్లకు మించిన స్కామ్ గా ఇది నిలిచింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ.. మరికొన్ని బ్యాంకులతో కలిసి ఏబీజీ ఫిప్ యార్డ్ కు రూ. 22,842 కోట్లను వ్యాపార రుణాన్ని అందించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం విదేశాల్లోని 38 కంపెనీలను, దేశంలోని మరో 60 సంస్థలను కంపెనీ ఈ వ్యవహారంలో వినియోగించుకుందని తేలింది. దేశంలోని 60 వివిధ సంస్థల ఖాతాల ద్వారా డబ్బును విదేశాలకు చట్ట విరుద్ధంగా మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. సీబీఐ , ఎన్ ఫోర్స్ మెంట్ ఇప్పటికే కంపెనీపై క్రిమినల్ కాన్సిరసీ, చీటింగ్, మనీ లాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేశాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం విదేశాల్లోని ఏజెన్సీలకు కేసుకు సంబంధించి అవసరమైన సమాచారం కోసం సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. అసలు 2005 నుంచి 2012 మధ్య కాలంలోనే కంపెనీలోపల ఈ ఫ్రాడ్ జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ వ్యవహారంలో బయటపడ్డ విదేశీ సంస్థల్లో సింగపూర్ కు సంబంధించిన ఒక కంపెనీ వివరాలు గతంలో జరిగిన ఫారెన్సిక్ రికార్డుల్లో ఇప్పటికే బయటపడ్డాయి. మరోవైపు ఏబీజీ షిప్‌యార్డ్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. కంపెనీ ప్రాంగణంలో ఏజెన్సీ సోదాలు నిర్వహించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో ఆయనను ప్రశ్నించారు.బ్యాంకులను మోసగించిన కేసులో నిందితులందరిపై లుక్ అవుట్ సర్క్యులర్‌లు ఇచ్చినట్లు సీబీఐ ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఇవీ చదవండి..
Reliance Jio: రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ.. మళ్లీ షాకిచ్చిన కస్టమర్లు..
META: భారత్ లో ఆ సేవలను నిలిపివేసిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా.. ఎందుకంటే..