Aadhaar Update: ముఖ్యమైన డాక్యుమెంట్లలో అధార్ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర పనులన్నింటికి అధార్ ఎంతో ముఖ్యం. అయితే ఆధార్‌లో ఎన్నో లోపాలు జరుగుతుంటాయి. పేరు చిరునామా, మొబైల్ నంబర్‌లు తప్పుగా పడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఎంతో టెన్షన్‌కు గురవుతుంటాము. అందులో తప్పులుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి సమయంలో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
1. ముందుగా అధికారిక UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. వెబ్‌సైట్‌లో ఎడమ వైపు ఎగువన ఉన్న మై ఆధార్‌పై క్లిక్ చేయాలి.
3. తర్వాత అప్‌డేట్ యువర్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. తర్వాత UIDAI సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ssup.uidai.gov.in ఎంచుకోవాలి.
5. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్‌పై ఇచ్చిన క్యాప్చార్‌ను నమోదు చేసి, మీ Send OTPపై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
6. మీరు ఓటీపీ నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ చిరునామా, పుట్టిన తేదీ, లింగం వంటి వ్యక్తిగత వివరాలు పూరించాలి.
7. అప్పుడు మార్పులు చేయాలనుకుంటున్న విభాగాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ పేరును మార్చాలనుకుంటే పేరుపై క్లిక్ చేయాలి.
8. పేరును అప్‌డేట్ చేయడానికి మీ వద్ద తప్పినసరి ఐడీ ఫ్రూప్ ఉండాలి. ఐడీ ఫ్రూప్‌గా మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, రేషన్‌కార్డు అప్‌లోడ్ చేసుకోవచ్చు.
9. అన్ని వివరాలను పూరించిన తర్వాత మీ నంబర్‌కు ధృవీకరణ ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి సేవ్ చేయాలి. అప్పుడు మీ వివరాలన్ని మారుతాయి.
1. ముందుగా uidai.gov.inకి వెళ్లి, ఆధార్ అప్‌డేట్ విభాగంలో ఇచ్చిన ‘రిక్వెస్ట్ ఆధార్ వాలిడేషన్ లెటర్’పై క్లిక్ చేయండి
2. తర్వాత మీరు సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
3. మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
4. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ కు ఓటీపీ వస్తుంది.
5. ఓటీపీ, కాప్చార్ నమోదు చేయాలి.
6. తర్వాత మళ్లీ UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్‌పై క్లిక్ చేయాలి. మీరు సిక్రెట్ కోడ్ ద్వారా అప్‌డేట్ అడ్రస్ ఎంపికను ఎంచుకోవాలి.
7. సీక్రెట్ కోడ్‌ను నమోదు చేసిన తర్వాత కొత్త చిరునామా నమోదు చేసి క్లిక్ చేయాలి.
1. UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. మీ ప్రస్తుతం రిజిస్టర్డ్ నంబర్‌ను ఉపయోగించి కాప్చార్ కోడ్‌ను టైప్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
3. ఆపై సబ్మిట్ OTP అండ్ ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
4) ఇప్పుడు ఆన్‌లైన్ ఆధార్ సర్వీసెస్‌లోకి వెళ్లి అప్‌డేట్ మొబైల్ నంబర్‌ను ఎంచుకోవాలి.
5. అవసరమైన అన్ని వివరాలు నమోదు చేయాలి.
6. కాప్చార్ కోడ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత ఓటీపీని నమోదు చేయాలి.
7. మొత్తం ప్రక్రియ పూర్తైన వెంటనే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.25 చెల్లించాలి.
8. ఆన్‌లైన్ నగదు చెల్లింపు చేసిన తర్వాత మీకు వెంటనే కన్ఫార్మ్ అయ్యిందా లేదా అనే విషయం కోసం మీ మొబైల్ నంబరుకు URN కోడ్ వస్తుంది. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ద్వారా మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను మార్పు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: