Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం బిగ్ న్యూస్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పనికిరాదా..?

ఆధార్ కార్డులో ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. దీంతో దీనిని ప్రభుత్వ పథకాల కోసం, ఇతర సేవల కోసం గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తారు. అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూప్‌గా ఆధార్ ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం బిగ్ న్యూస్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పనికిరాదా..?
Aadhaar Card

Updated on: Apr 27, 2026 | 9:55 PM

ఆధార్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ కార్డులో ఒక వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ లాంటి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. అన్నీ వివరాలు ఒకేచోట ఉండటంతో ధృవీకరణ కోసం ఆధార్‌ను ఎక్కువగా కోరుతుంటారు. అయితే డేట్ ఆఫ్ బర్త్‌కు ప్రూఫ్‌గా ఆధార్‌ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ విషయంపై కేంద్రం స్పష్టతిచ్చింది. ఆధార్ అనేది కేవలం వ్యక్తిగత గుర్తింపుకు మాత్రమేనని, డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణను ధ్రువీకరించే పత్రం కాదని స్పష్టం చేసింది. సెల్ప్ డిక్లరేషన్ ఆధారంగా ఆధార్ నమోదు సమయంలో సమాచారం అందిస్తారని, దీనిని డేట్ ఆఫ్ బర్త్‌ను ధృవీకరించే పత్రంగా పరిగణించలేమని తెలిపింది.

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదు..

వయస్సు ధృవీకరించేందుకు ఇక నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టెన్త్ సర్టిఫికేట్ చూపించాలని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక ప్రకటన జారీ చేసింది. ఆధార్ చట్టం-2016 ప్రకారం ఆధార్ ఒక వ్యక్తి డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ డేటా ఆధారంగా అందించే గుర్తింపు ధృవీకరణ పత్రం. అంతేకానీ డేట్ ఆఫ్ నిర్దారణను ధృవీకరించే డాక్యుమెంట్ కాదు. ఆధార్‌తో పొందుపర్చిన డేట్ ఆఫ్ బర్త్‌పై వివాదం వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కార్డుదారుడిపై ఉంటుందని యూఐడీఏఐ తన ప్రకటనలో వెల్లడించింది. ఆధార్ కార్డు పొందేటప్పుడు సెల్ప్ డిక్లరేషన్ ఇస్తుంటారు. ఇలంటి సమయంలో సరైన ఆధారాలు ఇవ్వకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనవరి 1వ తేదీన డీఫాల్ట్‌గా పుట్టిన తేదీగా తీసుకుంటుంది.

యూఐడీఏఐ ఏం చెప్పిందంటే..

ఈ క్రమంలో ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూప్‌గా పరిగణిచలేమని యూఐడీఏఐ చెబుతోంది. బర్త్ రిజిస్ట్రీగా దీనిని చూడలేమని, కేవలం ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు ఒక ధృవీకరణ సాధనంగా మాత్రమే ఉంటుందని తెలిపింది. అయితే పాస్ పోర్ట్ లేదా ఇన్యూరెన్స్ క్లెయిమ్ కోసం ఆధార్ కార్డుతో పాటు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Follow Us