Aadhaar Link: మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేశారా..? ఏయే బ్యాంకుకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోండిలా..!

|

Dec 26, 2021 | 5:42 PM

Aadhaar Link: భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడానికి ముఖ్యమైన దశలలో ఒకటి ఆధార్ కార్డు ద్వారా పౌరులందరికీ ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడం. ఆధార్‌ అనేది భారతీయ..

Aadhaar Link: మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేశారా..? ఏయే బ్యాంకుకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోండిలా..!
Follow us on

Aadhaar Link: భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడానికి ముఖ్యమైన దశలలో ఒకటి ఆధార్ కార్డు ద్వారా పౌరులందరికీ ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడం. ఆధార్‌ అనేది భారతీయ పౌరులకు ఎంతో ముఖ్యమైనది. భారతీయ పౌరులకు నివాసానికి ఆధార్ రుజువు. నేడు ఇది విశ్వసనీయ పౌరసత్వ రుజువుగా మారింది. అంతేకాకుండా దాదాపు ప్రతి ప్రభుత్వ ప్రణాళిక మరియు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు కూడా ఆధార్ సంఖ్య ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. ఈ కార్డు యొక్క ప్రాముఖ్యత చాలా రెట్లు పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు రేషన్‌ కార్డు, బ్యాంకింగ్‌ రంగంలో, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అయితే బ్యాంకులు, ఇతర వాటికి ఆధార్‌ కార్డు లింక్‌ కాని పక్షంలో వెంటనే చేసుకోవాలని ఇప్పటికే అధికారుల పదేపదే కోరుతున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే రెండు మూడు, ఇంకా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో తెలియక సతమతమవుతుంటారు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటంత తప్పనిసరి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవడం తప్పనిసరి.

ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోండిలా..
– ముందుగా యూఐడీఏఐ అధికారిక https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
– హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.
– Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.
– కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
– ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.
– సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
– ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.
– మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
– ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది, ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుసుకోవచ్చు. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. మీకు రెండు మూడు బ్యాంక్ ఖాతాలున్నట్లయితే మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్‌లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.

ఇవి కూడా చదవండి:

Spoofing: నకిలీ వెబ్‌సైట్‌పై ఒక్కసారి క్లిక్‌ చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్లే.. స్పూఫింగ్ అంటే ఏమిటి

Super App: ప్రవాస భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆర్థిక సేవల కోసం ప్రత్యేక యాప్‌..!