Aadhaar: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. కేంద్రం మరోసారి గడువు పొడిగింపు!

|

Dec 15, 2024 | 6:20 PM

Aadhaar Update: ఆధార్‌.. ఇది లేనిది ఏ పని జరగదు. ఏ చిన్న పనికైనా ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. అయితే ఆధార్‌ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌ వచ్చింది. మరోసారి గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది..

Aadhaar: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. కేంద్రం మరోసారి గడువు పొడిగింపు!
Follow us on

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంక్షిప్తంగా UIDAI కీలక ప్రకటన చేసింది. ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం కేంద్రం మళ్లీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్‌కు డిసెంబర్ 14 వరకు చివరి రోజు ఉండేది. కానీ కానీ ఈసారి ఆ గడువును వచ్చే ఏడాది అంటే జూన్ 14, 2025 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మీరు మీ ఆధార్ కార్డ్, పేరు, చిరునామా మొదలైనవాటిని ఉచితంగా (UIDAI) మార్చాలనుకుంటే, మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేయడానికి ఎటువంటి రుసుము ఉండదు. UIDAI వెబ్‌సైట్ నుండి ఆధార్ కార్డ్ డెమోగ్రాఫిక్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు గడుస్తున్న వారు తప్పనిసరిగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ వ్యవధి మళ్లీ మళ్లీ పొడిగించబడుతోంది. ఇంతకుముందు ఈ గడువు జూన్ 14, 2024. తర్వాత ఈ గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి ఈ గడువును పొడిగించింది. ఈ ఆధార్ కార్డ్ సమాచారాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డు వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. మీరు మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి ఎటువంటి ఖర్చు లేకుండా 14 జూన్ 2025 వరకు మీకు అవకాశం లభిస్తుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి?

  • ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌లో సందర్శించాలి.
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయడం ద్వారా మీ ప్రొఫైల్ ఓపెన్‌ అవుతుంది.
  • ఇప్పుడు మీరు డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగంలో అప్‌డేట్ చేయాలనుకుంటున్న మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.
  • డ్రాప్ డౌన్ జాబితా నుండి తగిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవడం ద్వారా ధృవీకరణ కోసం మీ పత్రాలను స్కాన్ చేసి అప్‌డేట్ చేయండి.
  • ఆ తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌తో మీరు ఈ పోర్టల్ నుండి అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి