ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. ఓ రకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ కూడా యువతకు నిత్యావసరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. గతంలో పొదుపు చేసుకున్న సొమ్మను బందిపోట్లు ఎత్తుకుపోయినట్లు ప్రస్తుతం మారిన టెక్నాలజీ వల్ల బ్యాంకుల్లో ఉన్న సొమ్మును కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో డబ్బుకు ప్రత్యామ్నాంగా క్రిప్టో కరెన్సీ అధిక ప్రాచుర్యం పొందింది. క్రిప్టో కరెన్సీను ఎవరూ తస్కరించేలేరనే నమ్మకంతో చాలా మంది ఆ కరెన్సీ గురించి తెలియకపోయినా దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆసక్తినే అవకాశంగా మలుచుకున్న కేటుగాళ్లు ఇటీవల ఓ మహిళను మోసగించి రూ.36 లక్షలు దోచుకున్నారు. ఈ తాజాగా ఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ముంబైకి చెందిన 44 ఏళ్ల మహిళ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో పడి రూ. 36 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్టాక్ వ్యాపారి అయిన మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై బీఎన్‌ఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద జూలై 3న ఖర్ఘర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిందితుడు బాధితురాలి వద్దకు వెళ్లి ఆమెను క్రిప్టోకరెన్సీ వ్యాపారంలోకి దింపాడు. కాలక్రమేణా ఇద్దరూ కలిసి రూ. 36,80,151 పెట్టుబడి పెట్టడానికి ఆమెను ఒప్పించారు. బాధితురాలు తన పెట్టుబడిపై రాబడి ఏదని నిందితులను ప్రశ్నించగా మాయమాటలు చెబుతూ తిరిగారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..