Fake Arrest: అరెస్ట్‌ పేరుతో నయా మోసం.. రూ.1.2 కోట్లు కొట్టేసిన కేటుగాడు

|

Jun 03, 2024 | 10:45 AM

పార్శిల్‌ డెలివరీ పేరుతో ఇటీవల కాలంలో కొత్త స్కామ్‌ను కేటుగాళ్లు ఎంచుకున్నారు.  పార్శిల్ స్కామ్, నకిలీ డిజిటల్ అరెస్ట్ కేసులో హైదరాబాద్ వాసి తాజా బాధితుడు అయ్యాడు. అతడు 20 రోజుల వ్యవధిలో రూ. 1.2 కోట్లు కోల్పోయాడు. మే 7న పోలీసు అధికారి పేరుతో బాధితుడికి ఫోన్‌ వచ్చింది. అతని పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, దానిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నాడు. ఈ కేసులో అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే డబ్బు డిమాండ్‌ చేసి మోసగించారు.

Fake Arrest: అరెస్ట్‌ పేరుతో నయా మోసం.. రూ.1.2 కోట్లు కొట్టేసిన కేటుగాడు
Scam
Follow us on

ధనం మూలం ఇదం జగత్‌ అని అంటూ ఉంటారు. సమాజంలో డబ్బు ఉన్న వాడినే కింగ్‌లా భావిస్తారు. ఈ నేపథ్యంలో డబ్బు ఏ రూపంలోనైనా సంపాదించాలని మోసగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పార్శిల్‌ డెలివరీ పేరుతో ఇటీవల కాలంలో కొత్త స్కామ్‌ను కేటుగాళ్లు ఎంచుకున్నారు.  పార్శిల్ స్కామ్, నకిలీ డిజిటల్ అరెస్ట్ కేసులో హైదరాబాద్ వాసి తాజా బాధితుడు అయ్యాడు. అతడు 20 రోజుల వ్యవధిలో రూ. 1.2 కోట్లు కోల్పోయాడు. మే 7న పోలీసు అధికారి పేరుతో బాధితుడికి ఫోన్‌ వచ్చింది. అతని పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, దానిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నాడు. ఈ కేసులో అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే డబ్బు డిమాండ్‌ చేసి మోసగించారు. ఈ తాజా స్కామ్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

పోలీసునని పరిచయం చేసుకున్న వ్యక్తి బాధితుడికి తన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఎలాంటి తప్పులు లేకుండా పంచుకోవాలని చెప్పాడు. అలాగే 24/7 ఆన్‌లైన్‌లో ఉండమని కోరాడు. ఇలా ఇరవై రోజుల పాటు వారు బాధితుడిని వేధించారు. కచ్చితమైన షిప్‌మెంట్, డెలివరీ వివరాలను చెప్పడంతో ఆ వ్యక్తి నిజమైన పోలీసు అధికారి అని నమ్మాడు. ముఖ్యంగా బాధితుడు చాలా పెద్ద కేసులో ఇరుక్కుడని సరైన చర్యలు తీసుకోకపోతే అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని భయపెట్టాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే మొదట్లో రూ. 30 లక్షలు పంపాలని చెప్పారు. ఇలా దఫదఫాలుగా 20 రోజుల పాటు బాధితుడి నుంచి రూ.1.2 కోట్లు తస్కరించారు. ముఖ్యంగా 20 రోజుల పాటు ఇంట్లోనే ఉండడం వల్ల కుటుంబం మొత్త మానసిక వేధనతో ఇబ్బందిపడాల్సి వచ్చిందని బాధితుడు వాపోయాడు. మానసిక ఒత్తిడి వల్ల బాధితుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకునేలా స్కామర్లు భయపెట్టారు.  అయితే బాధితుడు తన వివరాలను పంచుకునేందుకు ఇష్టపడలేదు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలిచే ఈ స్కామ్‌లో నేరస్థులు పోలీసుల్లా నటించి అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకోవడానికి భయాందోళన వ్యూహాలను ఉపయోగిస్తారు. అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు తీవ్రమైన నేరంలో పాల్గొన్నాడని, ఒత్తిడిని పెంచడానికి వారిని ఆన్‌లైన్‌లో ఉంచడం, ఒంటరిగా ఉంచడం, చట్టపరమైన పరిణామాలను నివారించడానికి బాధితుడిని డబ్బు చెల్లించమని వారు తరచుగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మోసాల నుంచి రక్షణ ఇలా

కాలర్ గుర్తింపు

ఎల్లప్పుడూ కాలర్‌కు సంబంధించిన గుర్తింపును స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లు లేదా పత్రాల నుంచి సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి అధికారిక సంస్థను నేరుగా సంప్రదించాలి.

వ్యక్తిగత సమాచారం

మీరు కాలర్‌కుసంబంధించిన గుర్తింపు గురించి ఖచ్చితంగా తెలియకుంటే ఫోన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ భాగస్వామ్యం చేయవద్దు.

అత్యవసర అభ్యర్థనలు

స్కామర్‌లు తరచుగా అత్యవసర భావాన్ని సృష్టిస్తారు. తక్షణ చెల్లింపుల కోసం ఏవైనా అభ్యర్థనలు లేదా చట్టపరమైన చర్యల బెదిరింపుల పట్ల సందేహాస్పదంగా ఉండాలి. 

అనుమానాస్పద కార్యకలాపాలు

ఏవైనా అనుమానాస్పద కాల్‌లు లేదా సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు, మీ బ్యాంకుకు నివేదించాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..