Success Story: రూ.50తో ప్రారంభించి రూ.14 వేల కోట్లకు వ్యాపార విస్తరణ.. మీనన్ జీవితం స్ఫూర్తిదాయకం

దృఢ సంకల్పం, కష్టబడి పనిచేసే తత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఈ లక్షణాలు కలిగిన చాలా మంది వ్యక్తులు జీవితంలో విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కేరళ రాష్ట్రానికి చెందిన పుత్తన్ నడువక్కట్ చెంతమరాక్ష మీనన్ (పీఎన్‌సీ మీనన్) కూడా అలాంటి వారే. కేవలం రూ.50 తో జీవితాన్ని ప్రారంభించిన ఆయన రూ. 14 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.

Success Story: రూ.50తో ప్రారంభించి రూ.14 వేల కోట్లకు వ్యాపార విస్తరణ.. మీనన్ జీవితం స్ఫూర్తిదాయకం
Pnc Menon, Founder And Chairman, Shobha Developers

Updated on: Apr 08, 2024 | 4:23 PM

దృఢ సంకల్పం, కష్టబడి పనిచేసే తత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఈ లక్షణాలు కలిగిన చాలా మంది వ్యక్తులు జీవితంలో విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కేరళ రాష్ట్రానికి చెందిన పుత్తన్ నడువక్కట్ చెంతమరాక్ష మీనన్ (పీఎన్‌సీ మీనన్) కూడా అలాంటి వారే. కేవలం రూ.50 తో జీవితాన్ని ప్రారంభించిన ఆయన రూ. 14 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. కళాశాల విద్య కూడా పూర్తి చేయని ఆయన విద్యార్థులు, యువతకు స్ఫూర్తిదాయకమయ్యారు. ఆయన విజయగాథను తెలుసుకుందాం.

చిన్న వయసులోనే తండ్రి మరణం..

పీఎన్ సీ మీనన్ కేరళలోని పాల్ ఘాట్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి సాధారణ రైతు. మీనన్ కు పదేళ్ల వయసు వచ్చేటప్పటికీ ఆయన తండ్రి మరణించారు. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. నిరక్షరాస్యుడైన తాత, తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కారణంగా మీనన్ చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎంతో కష్టబడి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తర్వాత ఆయన చదువు ముందుకు సాగలేదు. బీకామ్ పూర్తి చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

శోభా డెవలపర్స్ ప్రారంభం..

1990లో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ పరిశ్రమ నెమ్మదిగా జోరందుకుంటోంది. ఈ విషయాన్ని మీనన్ గమనించారు.1995లో శోభా డెవలపర్స్ (ప్రస్తుతం శోభా లిమిటెడ్)ను స్థాపించాడు, ఇప్పుడు ఇది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. దీంతో పాటు మిడిల్ ఈస్ట్‌లో కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మీనన్ కు డిజైన్లు రూపొందించడంతో ఎంతో నైపుణ్యం ఉంది. ఆయన డిజైన్ చేసిన సుల్తాన్ ఖబుస్ మసీదు, ఒమన్‌లోని అల్ బస్తాన్ ప్యాలెస్ ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మీనన్ తన వ్యాపారం రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఆయనకు 2009లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు. ప్రస్తుతం శోభా లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 14,100 కోట్లను కలిగి ఉంది, గల్ఫ్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రయాణం సాగిందిలా..

మీనన్ ప్రయాణం చాలా గమ్మత్తుగా సాగింది. ఓమన్ లో పనిచేయడానికి వచ్చిన ఆహ్వానం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. మీనన్ తన జేబులో రూ.50 తో అక్కడకు వెళ్లారు. విదేశంలో వ్యాపారం చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. కేవలం రూ.3.5 లక్షల రుణం తీసుకుని ఇంటీరియర్ డిజైన్ రంగంలోకి అడుగుపెట్టాడు. కష్టబడి పనిచేసి, ఆ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పెద్ద ప్రాజెక్టులు దక్కాయి. బ్రూనై సుల్తాన్ నివాసానికి చేసిన డిజైన్ మీనన్ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. నారాయణ మూర్తి దర్శకత్వంలో బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు కన్సల్టెంట్‌గా పనిచేశాడు. మీనన్ కు ఇంటీరియర్ డిజైన్‌లో అధికారిక డిగ్రీని కలిగిలేదు. కానీ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకూ గుర్తింపు పొందాడు.

ఆటంకాలను దాటుకుని..

మీనన్ ప్రారంభంలో అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. నిరాశ చెందకుండా కష్టబడి పనిచేసి తన వ్యాపారాన్ని అరబ్ దేశాలకు విస్తరించారు. దేశంలో ఆయన స్థాపించిన శోభా లిమిటెడ్‌ ప్రస్తుతం 12 రాష్ట్రాలలో పనిచేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..