MEIL OIL RIG: స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతున్న మేఘా సంస్ధ.. ONGCకి వచ్చే ఏడాది ఆఖరుకు 47 రిగ్గుల సరఫరా

|

Aug 27, 2021 | 9:20 AM

మేఘా ఇంజనీరింగ్‌ సంస్ధ నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గులతో విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అతి త్వరలోనే మరో రిగ్గు ONGCకి అందజేయడానికి మేఘా సంస్ధ సిద్ధమైంది.

MEIL OIL RIG: స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతున్న మేఘా సంస్ధ.. ONGCకి వచ్చే ఏడాది ఆఖరుకు 47 రిగ్గుల సరఫరా
Meil Oil Rig
Follow us on

నిర్మాణరంగంలో దిగ్గజం.. మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రిగ్గులను తయారు చేసి రికార్డ్‌ సృష్టించింది. ఇంతకీ ఏంటా రిగ్గులు.. ఎలా పనిచేస్తాయి..? మేఘా ఇంజనీరింగ్‌ సంస్ధ నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గులతో విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అతి త్వరలోనే మరో రిగ్గు ONGCకి అందజేయడానికి మేఘా సంస్ధ సిద్ధమైంది. రిగ్గులు తయారు చేయడంతో దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో 2 బిలియన్ డాలర్ల విలువ గల మార్కెట్ ను సొంతం చేసుకోనుంది మేఘా సంస్ధ.

MEIL గ్రూపు (Megha Engineering and Infrastructures Ltd) వచ్చే ఏడాది చివరి నాటికి ONGCకి 860 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6500 కోట్ల) విలువైన 47 డ్రిల్లింగ్‌ రిగ్గులు సరఫరా చేయనుంది. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. రిగ్గులు, సంబంధిత ఇతర ఉపకరణాల సరఫరాకు సంబంధించి తమ చేతిలో 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,250 కోట్ల) ఆర్డర్లు ఉన్నట్లు MEIL గ్రూపు ఆయిల్‌ రిగ్స్‌ డివిజన్‌ అధిపతి N.కృష్ణకుమార్‌ వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో దేశీయంగా, విదేశాల నుంచి సుమారు రూ.15,000 కోట్ల ఆర్డర్లు లభిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఓఎన్‌జీసీకి 47 డ్రిల్లింగ్‌ రిగ్గులు సరఫరా చేసే కాంట్రాక్టును ఎంఈఐఎల్‌ గ్రూపు 2019లో దక్కించుకుంది. ఇప్పటికే 20 ఉత్పత్తి చేశామని, 2022 సంవత్సరాంతానికి మిగిలిన 27 రిగ్గులను అందిస్తామని ఆయన తెలిపారు.

ONGCకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో భాగంగా ప్రస్తుతానికి 14 రిగ్గులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది చివరి కల్ల 23 రిగ్గులను ONGCకి అందించనుంది. ఈ రిగ్గులు అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. వీటిని పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీతో రూపొందించారు. సమీప భవిష్యత్తులో మనదేశంలో చమురు, సహజవాయువు రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని డ్రిల్‌మెక్‌ ఛైర్మన్‌ బొమ్మారెడ్డి శ్రీనివాస్‌ వివరించారు.

ఇందులో మాన్యువల్ గా చేసే పనులు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల సమయం ఆదా చేయడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందన్నారు డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్. భారత ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట అయిన మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రిగ్గులను తయారు చేయడం మాకు ఎంతో గర్వంగా ఉందని తెలిపింది మేఘా సంస్ధ.

మొదటి రిగ్గును ఓఎన్‌జీసీకి చెందిన కల్లోల్‌ ఆయిల్‌ ఫీల్డ్‌కు అందించగా, ఇప్పుడు రెండోది అందిస్తున్నారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం కల ఈ రిగ్గు 4 కిలోమీటర్ల లోతు వరకు సునాయాసంగా డ్రిల్‌ చేయగలుగుతుందని, 40 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందని కుమార్‌ వివరించారు. ఈ రిగ్గులు అత్యాధునిక హైడ్రాలిక్‌ వ్యవస్థతో పనిచేస్తాయి ఇందువల్ల సమయం ఆదాతో పాటు ప్రమాదాలు జరగవన్నారు.

ఈ రిగ్గులను ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని తెలిపారు. అసోం లోని జోరాహట్‌, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, అంకలేశ్వర్‌, మెహసన, కాంబే, త్రిపురలోని అగర్తలా, తమిళనాడులోని కరైకల్‌లోని ఓఎన్‌జీసీ క్షేత్రాలకు తాము రిగ్గులు అందిస్తున్నామన్నారు.

MEIL గ్రూపు కొంతకాలం క్రితం ఇటలీకి చెందిన డ్రిల్‌మెక్‌ అనే కంపెనీని సొంతం చేసుకుంది. ఈ సంస్థకు ఆయిల్‌, గ్యాస్‌ డ్రిల్లింగ్‌ రంగాల్లో విశేష అనుభవం ఉంది. దీనివల్ల రిగ్గులు ఉత్పత్తి చేసే సామర్థ్యం MEIL గ్రూపునకు లభించింది. ఇప్పటివరకు హైడ్రాలిక్‌ రిగ్గులను విదేశాల్లో తయారు చేస్తుండగా, మేఘా గ్రూప్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి స్తున్నారు.

ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్‌లలోని కేంద్రాల్లో రిగ్గులను డ్రిల్‌మెక్‌ ఉత్పత్తి చేస్తోంది. ఇటలీలోని మిలాన్‌ సమీపంలో, అమెరికాలోని హ్యూస్టన్‌, ఐరోపా దేశమైన బెలారస్‌లో ఉత్పత్తి చేపడుతోంది.

మేఘా సంస్థ హైడ్రోకార్బన్ రంగంలో దేశ విదేశాల్లో అనేక ప్రాజెక్ట్ లు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి మన్ననలు అందుకుంది. భారత దేశం లో అసోం, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, త్రిపుర , తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో సంక్లిష్టమైన ప్రాజెక్ట్ లు చేపట్టడంతో పాటు కువైట్, జోర్డాన్, బంగ్లాదేశ్, సింగపూర్ వంటి విదేశాల్లో అత్యాధునిక సాంకేతికత తో రిఫైనరీ ప్రాజెక్ట్ లను సకాలం లో పూర్తి చేసి తన సత్తాను డౌన్ స్ట్రీమ్ రంగంలోనూ నిరూపించుకుందిమేఘా సంస్ధ.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..