7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు అందనుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెంపు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి ఈ కబురు అందనుంది. మార్చి నెలాఖరులోగా డియర్నెస్ అలవెన్స్ (DA)పెంపు ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. కేంద్ర సర్కార్ త్వరలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచితే ఉద్యోగులకు వేతనం కూడా పెరగనుంది. ఇప్పుడు 2.57 రెట్ల ఫిట్‌మెంట్ ఉండగా, ఇది 3.68 చేయాలన్న డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి ఎన్నో రోజులుగా ఉంది. ప్రస్తుతం ఈ డిమాండ్ పెండింగ్‌లో ఉంది. వారి డిమాండ్‌ను అంగీకరిస్తూ కేంద్రం ఫిట్‌మెంట్ పెంచితే కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కానున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ కేంద్రం ఫిట్‌మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లయితే బేసిక్ వేతనం పెంపు ఉంటుంది. ఈ బేసిక్ వేతనం ఆధారంగా డీఏ, ఇతర అలవెన్స్‌లను లెక్కిస్తారు. ప్రస్తుతం ఉన్న 2.57 రెట్ల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో రూ.18వేల బేసిక్ వేతనం లభించనుంది. 3.68 రెట్ల ఫిట్‌మెంట్ ప్రకటిస్తే బేసిక్ రూ.8 వేల వరకు పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనాన్ని లెక్కించేందుకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది.
ప్రతియేటా రెండు సార్ల డీఏ పెంపు
కాగా, కేంద్ర సర్కార్ ప్రతి సంవత్సరం రెండు సార్లు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంచుతుంది. ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలలో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. డీఏ పెంపు మార్చిలో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అంతకు ముందు జూలై 1, 2021 నుంచి అమల్లోకి వచ్చే 28 శాతం నుంచి బేసిక్ పేలో 31 శానికి పెంచింది. ఈ నిర్ణయం దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి: