GST Council Meeting: వాటిపై జీఎస్టీ తగ్గించడం నుంచి బకాయిల విడుదల వరకు.. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే..

ఢిల్లీలో శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి..

GST Council Meeting: వాటిపై జీఎస్టీ తగ్గించడం నుంచి బకాయిల విడుదల వరకు.. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే..
Gst Council Meeting

Updated on: Feb 19, 2023 | 8:30 AM

ఢిల్లీలో శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశంలో తీసుకున్న 10 కీలక నిర్ణయాలు ఏంటో చూద్దాం.

  1. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను ఐదేళ్లపాటు రాష్ట్రాలకు విడుదల
  2. రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద కోర్టులు, ట్రిబ్యునల్‌లు అందించే సేవలపై పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
  3. లిక్విడ్ బెల్లంపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గింపు
  4. ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన కొనుగోళ్లకు 5 శాతం ట్యాక్స్‌
  5. ఇవి కూడా చదవండి
  6. పెన్సిళ్లు, షార్పనర్లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గింపు
  7. ట్యాగ్‌లు, ట్రాకింగ్ పరికరాలు, డేటా లాగర్‌లపై జీఎస్‌టీని కొన్ని షరతులలో 18 శాతం ఉన్న జీఎస్టీని ఎత్తివేత
  8. విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించే సేవలకు జీఎస్టీ మినహాయింపు.
  9. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల వరకు వార్షిక టర్నోవర్‌ ఉన్న జీఎస్‌టీ రిజిష్టర్డ్‌ వ్యాపారులు 2022-23 నుంచి జీఎస్‌టీఆర్‌-9 ఫారంలో సమర్పించే వార్షిక రిటర్న్‌లకు సంబంధించి ఆలస్య రుసుములో మార్పులు.
  10. రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ ఉంటే రోజుకు రూ.50 (టర్నోవరులో గరిష్ఠంగా 0.04%), రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు టర్నోవర్‌ ఉంటే రోజుకు రూ.100 (గరిష్ఠంగా 0.04%) మేర ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆలస్య రుసుము రోజుకు రూ.200గా (టర్నోవరులో గరిష్ఠంగా 0.5%)గా ఉంది.
  11. అయితే జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ల ఏర్పాటుపై మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికకు స్వల్ప మార్పులతో కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అభిప్రాయాల కోసం జీఎస్‌టీ చట్టంలో తుది ముసాయిదా సవరణలను సభ్యులకు పంపిస్తామని పేర్కొన్నారు. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో ఇద్దరు జ్యుడీషియల్‌ సభ్యులు ఉండాలని, ఈ ట్రైబ్యునల్‌ ప్రధాన బెంచ్‌ ఢిల్లీ నుంచి, మిగతా బెంచ్‌లు రాష్ట్రాల నుంచి పనిచేస్తాయని మంత్రి తెలిపారు. జనాభా, వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ట్రైబ్యునల్‌ బెంచ్‌ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.50 లక్షల వరకు వివాదాలను ఒక్క సభ్యుడే విచారించాలని ప్రతిపాదించినట్లు మంత్రి వెల్లడించారు.
  12. పాన్‌ మసాలా, గుట్కా లాంటి ఉత్పత్తుల వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టి, పన్నుల ఆదాయాన్ని పెంచేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫారసులను జీఎస్‌టీ మండలి ఆమోదించిందని మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి