AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: హమ్మయ్య.! చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే..

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అని తేడా లేకుండా మాడుపగిలే ఎండలతో.. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అటు వేసవిలో ఎలాగూ ఏసీలు, కూలర్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.

Portable AC: హమ్మయ్య.! చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే..
Portable Ac
Ravi Kiran
|

Updated on: Apr 24, 2024 | 5:33 PM

Share

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అని తేడా లేకుండా మాడుపగిలే ఎండలతో.. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అటు వేసవిలో ఎలాగూ ఏసీలు, కూలర్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. కొందరైతే వీటిని కొనగలరు.. మరికొందరికి ఏసీలు, కూలర్లు అందని ద్రాక్షే. మరి అలాంటి వారి కోసం మినీ, పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి ఆకారంలో చిన్నగా, బరువు తక్కువగా ఉంటాయి. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. అలాగే అందరినీ అక్షరించే రేటులో, అద్భుతమైన ఫీచర్లతో దొరుకుతున్నాయి.

పైన పేర్కొన్న పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. Portable 3 Speed ​​Low Noise Mini Air Conditioner పేరుతో అమ్మకంలో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీ సుమారు రూ. 3500లకు లభిస్తోంది. ప్రస్తుతం స్టాక్ లేదు గానీ.. దీని ఫీచర్లపై ఓ లుక్కేయండి. ఇందులో ఉన్న మినీ వాటర్ ట్యాంక్‌లో 500 మిల్లీలీటర్ల నీరును పోయవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్ వేస్తే.. మరింత చల్లగాలి మీ సొంతం. ఇందులోని ఫ్యాన్ స్పీడ్‌ను కంట్రోల్ చేసుకునే ఛాన్స్ మీకే ఉంటుంది. ఇది చల్లటి గాలిని మాత్రమే కాదు.. రాత్రుళ్లు చక్కని లైటింగ్ కూడా అందిస్తుంది. అలాగే ఈ పోర్టబుల్ ఏసీ నుంచి వచ్చే సౌండ్ కూడా చాలా తక్కువ. 40 డెసిబుల్స్ లోపే ఉంటుంది. మీకు చక్కని నిద్రను ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓసారి అమెజాన్‌లో చెక్ చేసేయండి..(Source)