Royal Enfield Classic 350: భారత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న మోటారు సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. బుల్లెట్ బైక్ ఎక్కి షికార్లు కొట్టాలని చాలామంది యువత ఇష్టపడతారు. అందుకు తగినట్లుగానే కంపెనీ కొత్త బైక్‌లను మార్కెట్లో విడుదల చేస్తుంటుంది. అలాంటి వారికి ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. అయితే ఈ బైక్‌లను లక్ష యూనిట్లకుపైగా తయారు చేసింది కంపెనీ. ఈ బైక్‌లో పలు సమస్యలు ఉన్న కారణంగా విక్రయించిన బైక్‌లను వెనక్కి తీసుకోవాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్ణయించింది. ఈ బైక్‌లో బైక్‌లో బ్రేకింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించి అన్ని ఈ మోడల్‌కు చెందిన అన్ని బైక్‌లను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపడుతోంది.
ఈ సమస్య 2021 సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్య తయారైన 26,300 మోడళ్లను ప్రభావిం చేస్తుంది. ఈ తేదీల్లో తయారైన బైక్‌లను గురించి వాటిని వెనక్కి తీసుకనేలా కస్టమర్లను గుర్తిస్తోంది రాయల్ ఎన్‌ఫీల్డ్. వాటిని వెనక్కి తీసుకున్న తర్వాత లోపాలను సరి చేస్తామని కంపెనీ చెబుతోంది.
ఈ బైక్ 3 వేరియంట్లలో విడుదలైంది. సింగిల్ సీటర్ క్లాసిక్ 350, ట్విన్ సీటర్ క్లాసిక్ 350, క్లాసిక్ 350 సింగిల్ ఎడిషన్ వేరియంట్లు అందుబాటులో వచ్చింది. దీని ధరలు.. ఫైర్ బాల్ వేరియంట్ ధర రూ.1.84,374, అలాగే సూపర్ నోవా వేరియంట్ ధర 1,87,128 (చెన్నై ఎక్స్‌షోరూమ్) ఉంది.
ఇవి కూడా చదవండి: